సినిమా కోసం శాఖహారి గా మారిందట

0

తమిళం లో వరుస చిత్రాల తో దూసుకు పోతున్న నయనతార లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటుంది. సౌత్ ఇండియా మొత్తం యమ క్రేజ్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలను వరుసగా చేస్తోంది. ప్రస్తుతం ఈమె ఒక భక్తిరస చిత్రాన్ని చేస్తోంది. ‘ముకుతి అమ్మన్’ అనే టైటిల్ తో తమిళంలో రూపొందుతున్న చిత్రంలో నయనతార కన్యాకుమారి అమ్మ వారిగా కనిపించబోతుందట. ఈ చిత్రం కోసం నయనతార చాలా దీక్షగా ఉంటుందట.

స్వతహాగా క్రిస్టియన్ అయిన నయనతార దేవళ్ల సినిమాలు చేసినా.. అలాంటి పాత్రలు పోషించినా కూడా పూర్తి నిబద్దతతో చేస్తుంది. కన్యాకుమారి అమ్మవారి పాత్రను పోషించేందుకు గాను నయనతార శాఖాహారిగా మారిపోయిందట. షూటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రతి రోజు కూడా శాఖాహారమే తినబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఒక పూట భోజనంను కూడా ఆమె వదిలేసినట్లుగా తెలుస్తోంది. అమ్మవారిపై పూర్తి భక్తి తో ఈ సినిమాను చేయాలని ఆమె భావిస్తోంది.

గతంలో బాలకృష్ణ ప్రధాన పాత్ర లో తెరకెక్కిన శ్రీరామ రాజ్యం చిత్రం సమయంలో కూడా నయనతార పూర్తిగా హిందూ ధర్మంను పాటించింది. సీత పాత్ర కోసం ఆమె పూర్తి ఎఫర్ట్ పెట్టింది. ఆ సమయంలో కూడా నయనతార పూర్తి శాఖాహారిగా మారడంతో పాటు హిందూ దేవుళ్లను కూడా పూజించినట్లుగా వార్తలు వచ్చాయి. సినిమాలో ఒక పాత్ర చేయడం కోసం మరీ ఇంత కఠోర దీక్ష చేయాల్సిన అవసరం లేదు. కాని నయనతార తాను ఏ పని చేసినా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంది. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అయ్యింది.
Please Read Disclaimer