పండుగలు సరే.. పెళ్లి ఎప్పుడు?

0

తమిళ స్టార్ హీరోయిన్ నయనతార గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి సమయం చిక్కినప్పుడల్లా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు – పబ్ లు అంటూ తిరుగుతున్న ఈ లవ్ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కాని ఇప్పటి వరకు వారి నోటి నుండి మాత్రం పెళ్లి గురించిన మాట రావడం లేదు. విదేశాల్లో హాలీడే ట్రిప్స్ వేస్తున్న వీరిద్దరు పెళ్లి విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. వీరిద్దరు సహజీవనం చేస్తున్నారనే టాక్ కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

గతంలో ఓనం పండుగను విఘ్నేష్ తో కలిసి కుటుంబ సభ్యుల సమక్షంలో కేరళలో జరుపుకున్న నయనతార తాజాగా దీపావళిని చెన్నైలో అదే విఘ్నేష్ తో కలిసి జరుపుకుంది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు దీపావళి పార్టీని చేసుకున్నారు. ఆ పార్టీలో నయన్ మరియు విఘ్నేష్ శివన్ కూడా పాల్గొన్నారు. పార్టీ మొత్తంలో వారిద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ ప్రారంభం నుండి ముగిసే వరకు ఇద్దరు కలిసే ఉన్నారట – కలిసి తిన్నారట. వీరిద్దరి జంట చూసి అంతా కూడా చూడముచ్చటగా ఉందని అనుకున్నారట.

పార్టీ – ఫంక్షన్స్ – పండుగలు – హాలీడే ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న వీరు పెళ్లి మాట మాత్రం ఎత్తక పోవడం మరోసారి కోలీవుడ్ లో చర్చనీయాంశం అవుతోంది. పెళ్లి చేసుకుంటే సినిమా ఆఫర్లు తగ్గుతాయేమో అనే ఉద్దేశ్యంతో నయన్ సహజీవనం మాత్రమే చేస్తుందని – పెళ్లికి సమయం తీసుకుంటుందని కొందరు అంటున్నారు. మొత్తానికి నయన్ మూడవ ప్రేమ అయినా పెళ్లి పీఠకు వెళ్తుందా అనేది సౌత్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది.
Please Read Disclaimer