పెళ్లికి ముందు నయన్ ఆధ్యాత్మిక టూర్

0

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ పెళ్లి విషయం ఎప్పుడు మీడియాలో నానుతూనే ఉంటుంది. శింబుతో ప్రేమలో పడ్డప్పటి నుండి నయన్ పెళ్లి గురించిన ప్రచారం జరుగుతూనే ఉంది. కొన్ని కారణాల వల్ల శింబుతో బ్రేకప్ అయిన నయన్ ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమలో పడినది. అతడిని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్దం అయ్యింది. ఆయనతో కూడా నయన్ పెళ్లి పీఠలు ఎక్కలేదు. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో ఉంది. సుదీర్ఘ కాలంగా వీరిద్దరు సహజీవనం కూడా సాగిస్తున్నారు. ఈ కరోనా వచ్చి ఉండకుంటే నయన్ విఘ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకునే వారు.

పెళ్లికి ముందు నయనతార కొన్ని దేవాలయాలకు వెళ్లి మొక్కు తీర్చుకోవాల్సి ఉందట. ఈ నెల మరియు వచ్చే నెలల్లో పలు దేవాలయాలకు వెళ్లి నయన్ మొక్కులు తీర్చుకోనున్నట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మొదటగా తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మక దేవాలయంగా పేరున్న రాహు దేవాలయంను నయన్ మరియు విఘ్నేష్ శివన్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించనున్నారు. ఆ తర్వాత కుంభకోణంలో ఉన్న తిరునాగేశ్వరమ్ ఆలయంలో కూడా మొక్కు చెల్లించనున్నారు.

వాటితో పాటు తిరుమల శ్రీవారిని మరియు శ్రీకాళహస్తి దేవాలయంను కూడా నయన్ సందర్శించాల్సి ఉందట. ఈ ఆద్యాత్మిక టూర్ పూర్తి అయిన తర్వాత తమిళనాడులోనే ఒక దేవాలయంలో ఆమె వివాహం జరుగనుంది. నయన్ వివాహం కోసం ఆమె అభిమానులు మరియు సినీ జనాలు చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నటించాలనేది నయన్ ప్లాన్ గా తెలుస్తోంది.