ప్రియుడికి సర్ ప్రైజ్ బర్త్ డే పార్టీ ఇచ్చిన నయన్

0

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోకున్నా కూడా కలిసే ఉంటున్నారనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా నయనతార డబ్బులు పెడుతూ విఘ్నేష్ శివన్ ను నిర్మాతగా కూడా మార్చింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ ను విఘ్నేష్ శివన్ పేరుతో ప్రారంభించి అందులో సినిమాల నిర్మాణం చేస్తుంది. వీరిద్దరి మద్య ప్రేమ ఏ స్థాయిలో ఉందో నిరూపించే మరో సంఘటన ఇది.

నేడు అంటే సెప్టెంబర్ 18వ తారీకు విఘ్నేష్ శివన్ బర్త్డే. ప్రియుడి బర్త్ డే సందర్బంగా నిన్న అర్థరాత్రి 12 గంటల తర్వాత నయన్ పార్టీ ఏర్పాటు చేసింది. విఘ్నేష్ శివన్ సర్ ప్రైజ్ అయ్యే విధంగా నయన్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో సెలబ్రెటీలు బ్లాక్ థీమ్ తో కనిపించారు. ఈ పార్టీలో దర్శకుడు అట్లీ కుమార్.. సంగీత దర్శకుడు అనిరుధ్ మరియు ఇంకా విఘ్నేష్ స్నేహితులు పాల్గొన్నారు. గోల్డ్ కేక్ పై ‘డబ్ల్యూ’ అనే అక్షరా రాసి ఉంది. విఘ్నేష్ శివన్ ను నయన్ విక్కీ అని పిలుస్తుంది. అందుకే డబ్ల్యూ అనే అక్షరంను కేక్ పై పెట్టారు.

కేక్ కట్ చేసిన తర్వాత విఘ్నేష్ మొదటగా నయన్ కు తినిపించగా.. ఆ తర్వాత విఘ్నేష్ కు నయన్ తినిపించింది. విఘ్నేష్ బర్త్ డే పార్టీలో నయన్ చాలా యాక్టివ్ గా కనిపించింది. సాదారణంగా నయన్ ఇలాంటి పార్టీల్లో ఎక్కువగా పాల్గొనదు. కాని విఘ్నేష్ బర్త్ డే అవ్వడంతో ఫుల్ జోష్ లో నయన్ పాల్గొంది. పాల్గొనడమే కాకుండా విఘ్నేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొత్తం ఆమె చూసుకుంది. డ్రస్ కోడ్ నుండి కేక్ డిజైన్ వరకు అన్ని నయన్ అభిరుచికి తగ్గట్లుగా జరిగినట్లుగా పార్టీలో పాల్గొన్న సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా యమ బిజీగా ఉన్న కారణంగా పెళ్లి గురించి నయన్ ఆలోచన చేయడం లేదనిపిస్తుంది.
Please Read Disclaimer