2020 సెలబ్రేషన్ తో ఓపెనైన హాట్ కపుల్

0

కోలీవుడ్ హాట్ కపుల్ విఘ్నేష్ శివన్ – నయనతార బాండింగ్ గురించి తెలిసిందే. నాలుగైదేళ్లుగా ఈ జంట ప్రేమాయణం నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. నేడో రేపో పెళ్లి పీటలు ఎక్కనున్నారన్న ప్రచారం ఉంది. అయితే అవేవీ నిజం కావని నయన్ బిజీ కెరీర్ క్లియర్ కట్ గా చెబుతోంది. నయన్ 2019లో సైరా – నరసింహారెడ్డి చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 25 క్రిస్మస్ మొదలు జనవరి 1 వరకూ ప్రియుడు విఘ్నేష్ తో కలిసి విహారయాత్రల్లో బిజీబిజీగా ఉంది నయన్. ఎట్టకేలకు ఈ జంట వెకేషన్ .. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు రివీలయ్యాయి. నయనతార స్వయంగా ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేసింది.

విఘ్నేష్ కలిసి చిలౌట్ చేసిన ఫోటోల్ని ఫ్యాన్స్ కి షేర్ చేయడం ద్వారా నయన్ 2020ని గ్రాండ్ గా ప్రారంభించారు. తాను ఓ అన్ నోన్ ప్రదేశంలో పోజులిస్తుంటే.. విఘ్నేష్ ఫోటోగ్రాఫర్ గా మారి తనని కెమెరాలో బంధించేస్తున్నాడు. అలాగే క్రిస్మస్ సందర్భంగా విఘ్నేష్ శివన్ ఒక అందమైన క్యాప్షన్ తో పాటు కొన్ని ఫోటోలను పంచుకున్నారు. “నా వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !!! సంతోషాన్ని లోకం అంతా విస్తరించండి! కష్టతరమైన సమయాల్లో కూడా .. చిరునవ్వును పంచండి. ప్రతిదీ ఎంతో ఆనందమయం చూసుకోండి! అన్నింటికంటే.. కష్టకాలాన్ని పాజిటివిటీతో చూసుకునే నిజమైన ప్రియమైన వారి రూపంలో దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు !! భగవంతునిపై నమ్మకం ఉంచండి .. ఉత్తమమైన వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉండండి! పాజిటివ్ వైబ్స్ మాత్రమే! “ అంటూ విఘ్నేష్ ఎమోషనల్ అయ్యాడు. నయనతార కథానాయికగా విఘ్నేష్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేత్రికన్ అనేది ఈ సినిమా టైటిల్. విఘ్నేష్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

నానుమ్ రౌడీ థాన్ స్క్రిప్ట్ వినిపించే సమయంలో విఘ్నేష్ .. అందాల నయన్ ని కలిసారు. అదే మొదటి పరిచయం. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి నయనతార – విఘ్నేష్ మధ్య ప్రేమాయణం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Please Read Disclaimer