ఎట్టకేలకు అసలు విషయం చెప్పేసింది

0

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార చాలా కాలంగా విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇద్దరు ఏకంగా సహజీవనం కూడా సాగిస్తున్నారని ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు విఘ్నేష్ శివన్ గురించి ఎక్కడ నోరు విప్పని నయనతార మొదటి సారి ఒక అవార్డు వేడుకలో తన ప్రియుడి గురించి నోరు విప్పి చెప్పి తన లవ్ ను ఇన్నాళ్లకు కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం తాను విఘ్నేష్ ప్రేమలో చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆమె చేసిన కామెంట్ పలు పుకార్లకు అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

విఘ్నేష్ తో ప్రతి చిన్న అకేషన్ ను చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకునే నయనతార మొన్నటి కొత్త సంవత్సరంను మాత్రం ఆయనతో సెలబ్రేట్ చేసుకోలేదు. కారణం ఏంటో కాని ఇద్దరు కూడా ఆరోజు కలవలేదని వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య వివాదం కారణంగా కొత్త సంవత్సరం రోజున కలవలేదు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లకు సమాధానం అన్నట్లుగా తాజా అవార్డు వేడుకలో నయనతార విఘ్నేష్ శివన్ గురించి పూర్తిగా ఓపెన్ అయ్యింది.

ఇన్ని రోజులు ఫొటోలు మరియు వీడియోలు విడుదల చేస్తూ తమ ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చిన నయనతార మొదటి సారి నోరు విప్పి మాట్లాడింది. అవార్డు అందుకున్న తర్వాత అభిమానులు మరియు తనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన నయన్ ఆ తర్వాత విఘ్నేష్ ప్రేమలో ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నాను అంది. నా కలల సాకారంకు విఘ్నేష్ చాలా సాయంగా నిలుస్తున్నాడు అంది. విఘ్నేష్ తో నయన్ వివాహం అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Please Read Disclaimer