అందం కోసం కేరళ వెళ్లిన నయనతార

0

‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు – తమిళ ప్రేక్షకులకు దగ్గరైన నయనతార ఆ తర్వాత రెండు భాషల్లోని అగ్ర హీరోలందరితోనూ నటించి మెప్పించింది. మొదట్లో కొంచెం బొద్దుగా ఉన్న ఈ అమ్మడు రాను రాను జీరో సైజుకి మారి మరింత నాజూకుగా తయారయ్యింది. అటు సీనియర్ హీరోలతో పాటు – ఇటు యువ హీరోలతోనూ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది నయనతార. 34 సంవత్సరాల నయనతారకి ఈ మధ్య వయస్సు పెరగడంతో తన అందం తగ్గుతుందనే బెంగ పట్టుకుంది.

ఇటీవల ఆమె నటించిన సినిమా ‘సైరా’ లో వయస్సుకు మించి పెద్ద దానిలా కనిపించడంతో ఆమె తన అందం గురించి ఆందోళన చెందుతుంది. దీంతో ఆమె ఎలా అయినా తన అందాన్ని కాపాడుకోవాలని తన స్వంత రాష్ట్రమైన కేరళ వెళ్లినట్టు సమాచారం. జిమ్ – యోగాలతో ఎంత కష్టపడినా ప్రయోజనం కనపడకపోవడంతో కేరళలో మాత్రమే దీనికి పరిష్కారం ఉందని తెలుసుకుని అక్కడకి వెళ్ళింది. షూటింగ్ లకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని కేరళలో చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తనకంటే వయస్సులో ఒక సంవత్సరం చిన్నవాడైన దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ వీళ్ళిద్దరూ తమ ప్రేమ సంగతి ఎక్కడా బయటపెట్టలేదు. విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఆమె మొదటిసారిగా ‘నానుమ్ రౌడీ’ అనే తమిళ సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా పబ్లిక్ ఫంక్షన్స్ కి కూడా వీళ్ళిద్దరూ కలిసే హాజరయ్యారు. కొన్ని నెలల క్రితం జరిగిన విగ్నేష్ బర్త్ డే ఫంక్షన్ లో నయనతార హడావుడి మాములుగా లేదు. ఇంత జరిగినా వీళ్ళ ప్రేమ గురించి మాత్రం బయటకి చెప్పట్లేదు.
Please Read Disclaimer