నయన్ హాట్నెస్.. సేమ్ టు సేమప్పా!

0

సౌత్ లో గత కొన్నేళ్ళుగా టాప్ స్టార్ హీరోయిన్ గా కొనసాడమే కాకుండా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నయనతారకు ఇప్పటికీ పోటీ ఇచ్చే హీరోయిన్ మరొకరు లేరు. అటు రజనీకాంత్.. విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తూనే యోగిబాబు లాంటి హీరోలతో జోడీ కట్టి ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటుతోంది.

పారితోషికం.. ఇమేజ్ విషయంలోనే కాదు.. గ్లామర్ విషయంలో కూడా నయన్ కు నయనే సాటి. ఇప్పటికే నయన్ కొత్తతరం భామలకు గట్టిపోటీ ఇస్తోంది. అందుకే నయన్ కు అభిమానుల సంఖ్య ఎక్కువ. ఫ్యాన్స్ అన్న తర్వాత వారు తమ అభిమానాన్ని ఏదోరూపంలో చూపిస్తారు. ఈమధ్య అలాగే నయన్ అభిమానులు నయన్ పాత ఫోటోను.. కొత్త ఫోటోను పక్కపక్కనే పెట్టి పోలుస్తూ ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

ఈ కంపారిజన్ లో మొదటిది పాత ఫోటో. ఈ ఫోటోలో నయన్ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర తడిబట్టలతో సూపర్ హాట్ గా కనిపిస్తోంది. ఇక రెండో ఫోటోలో వైట్ డ్రెస్ లో చక్కగా రెడీ అయ్యి మరీ పోజిచ్చింది. మొదటి ఫోటోలో లిప్ స్టిక్ వేసుకోలేదు.. రెండో ఫోటోలో లిప్ స్టిక్ వేసుకుంది అంతే తేడా. రెండు ఫోటోలలో నయన్ గ్లామర్ మాత్రం సేమ్ సేమ్. కొత్త తరం భామలకు నయన్ ఒక ప్రేరణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.