ప్రియుడిని బరిలోకి దించిన స్టార్ హీరోయిన్!

0

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా.. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకు పోతున్న ముద్దుగుమ్మ నయనతార. ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవ్వడంతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. సౌత్ హీరోయిన్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతార నిలిచింది. ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తున్న నయనతార ప్రస్తుతం నిర్మాణంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

నయనతార డైరెక్ట్ గా నిర్మాత అనిపించుకోకుండా తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది. స్వతహాగా దర్శకుడైన విగ్నేష్ ప్రస్తుతం సినిమా నిర్మాణంకు సిద్దమయ్యాడు. మిలింద్ రావు దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా విగ్నేష్ సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుంది. వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్న నయన తార ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సిద్దమవుతోంది.

‘అవళ్’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మిలింద్ రావు చెప్పిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయిన నయనతార స్వయంగా నిర్మించేందుకు సిద్దం అయ్యింది. అయితే హీరోయిన్ గా నటిస్తూ నిర్మాణం చూసుకోవడం కష్టం అనే ఉద్దేశ్యంతో నిర్మాణ బాధ్యతలను తన ప్రియుడు విగ్నేష్ శివన్ కు అప్పగించిందని తమిళ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తెలుగులో ఈమె నటించిన ‘సైరా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మరో వైపు రజినీకాంత్ తో ‘దర్బార్’ చిత్రంలో కూడా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే. ఇన్ని సినిమాలు చేస్తున్న ఈమె రెండు చేతులతో సంపాదిస్తూ ఇప్పుడు నిర్మాణంలో పెట్టుబడులు పెడుతోంది. హీరోయిన్ గా సక్సెస్ అయిన నయన తార నిర్మాతగా కూడా లాభాలు దక్కించుకుంటుందా చూడాలి.
Please Read Disclaimer