పది కోట్లు ఇస్తానన్నా చేయనని తేల్చేసింది!

0

ఒక హీరోయిన్ కు ఒక సినిమా చేస్తే రూ.10 కోట్ల రెమ్యునరేషన్ అంటే ఓకే అనకుండా ఉంటారా? అందులోకి కుర్ర హీరోతో అంటే తమ మార్కెట్ మరింత పెరుగుతుందన్నట్లుగా రియాక్ట్ అవుతుంటారు. అందరూ ఒకేలా ఉంటే ప్రత్యేకత ఏముంటుంది?

తనకు నచ్చిన ప్రాజెక్టులో తప్పించి.. నచ్చని ప్రాజెక్టును నిర్మోహమాటంగా నో చెప్పేసే నయన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉంటారు కానీ.. తాను చేసిన సినిమాకు ప్రమోషన్ కు రాని అతి తక్కువ మంది హీరోయిన్లలో నయనతార ఒకరిగా చెప్పాలి.

సినిమా చేయటానికి ముందే అగ్రిమెంట్లో తాను ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లో పాల్గొనని.. ఇప్పటి హీరోలు.. హీరోయిన్ల మాదిరి సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇవ్వటం లాంటివి చేయనని చెప్పేసే నయనతార.. తాజాగా ఒక కొత్త హీరోతో జత కట్టటానికి నో చెప్పేసిందట.

బంపర్ ఆఫర్ లాంటి రెమ్యునరేషన్ ఇస్తానన్నా కుదరదంటే కుదరదని చెప్పిన ఆమె వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో శరవణన్ అనే కొత్త హీరోతో సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. హీరోయిన్ గా నయనతారను అనుకున్నారు. మూడు..నాలుగు సినిమాలకు ఇచ్చే రెమ్యునరేషన్ ఒకే సినిమాకు వస్తానంటే ఓకే చెబుతారన్న అంచనాకు భిన్నంగా.. రూ.10 కోట్లు పారితోషికంగా ఇస్తానన్నా నో చెప్పేసిందట.

కొత్త హీరోతో సినిమా చేయటం ఏమిటన్న ఉద్దేశంతో రిజెక్ట్ చేసినట్లు కొందరు చెబుతుంటే.. అదేమీ లేదు..కథ నచ్చక నో చెప్పారని మరికొందరు చెబుతున్నారు. ఏమైనా.. భారీ రెమ్యునరేషన్ ఇస్తామంటూ వెతుక్కుంటూ వచ్చిన ఆఫర్ ను లైట్ తీసుకొని నో చెప్పేయటం నయనతారకు మాత్రమే సాధ్యమవుతుందేమో?
Please Read Disclaimer