లేడీ సూపర్ స్టార్ ఇలాంటి పాత్రలు ఏంటీ?

0

లేడీ సూపర్ స్టార్ గా అభిమానులు పిలుచుకుంటున్న నయనతార తమిళంలో ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు చేస్తోంది. తెలుగులో కూడా ఈ అమ్మడు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే ఉంది. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న నయనతార తాజాగా ‘దర్బార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన దర్బార్ చిత్రంలో రజినీకాంత్ కు జోడీగా నటించింది.

రజినీకాంత్ ‘దర్బార్’ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయనతార పాత్రపై ఆమె అభిమానులు పెదవి విరుస్తున్నారు. సినిమా మొత్తం కలిపి ఆమె స్క్రీన్ ప్రజెన్స్ కేవలం 25 నిమిషాలే. సాదా సీదా హీరోయిన్ మాదిరిగా సినిమాలో ఆమె గ్లామర్ డాల్ గా మిగిలి పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో గజినీ చిత్రం సమయంలో మురుగదాస్ నన్ను మోసం చేశాడు.. నా పాత్ర నిడివి ఎక్కువ అంటూ చెప్పి చాలా తక్కువ చూపించాడు అంటూ ఆ మద్య ఒక ఇంటర్వ్యూలో వాపోయింది. ఇప్పుడు మళ్లీ దర్బార్ లో కూడా అదే పరిస్థితి. రజినీకాంత్ కాంబోలో కొన్ని సీన్స్ మినహా ఆమెకు ఏమాత్రం ప్రాముఖ్యత దక్కలేదు. ఈ కాస్త పాత్రకు ఏకంగా 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుందట. లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు నెత్తిన పెట్టుకుంటూ ఉంటే ఇలా గ్లామర్ డాల్ పాత్రలు చేయడం ఏంటో. పారితోషికం కోసం అభిమానులను ఈ అమ్మడు నిరుత్సాహపర్చిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Please Read Disclaimer