వసంతకాలం ట్రైలర్ టాక్

0

లేడీ సూపర్స్టార్ నయనతార ఓ సినిమాలో నటిస్తోంది అంటే అభిమానులు ఆసక్తిగానే వేచి చూస్తారు. నయన్ నటించిన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ `మాయ` తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా తను నటించిన మరో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ తెలుగులో `వసంతకాలం` పేరుతో రిలీజవుతోంది. 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై దామెర విఎస్ఎస్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈనాడు – బిల్లా 2 చిత్రాల దర్శకుడు చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో రిలీజైంది. తెలుగు అనువాదం రెడీ అవుతోంది.

తాజాగా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ .. హారర్ .. థ్రిల్ యథావిధిగానే పాత వాసనలతోనే కనిపిస్తున్నాయి. అన్ని హారర్ థ్రిల్లర్ల లానే .. కథాంశం పరంగా కొత్తగా చెప్పుకోవడానికేం లేదు. దూరంగా ఓ ఒంటరి భవంతి… భవనం ముందు గార్డెన్.. ఆ ఇంట్లో ఏవో అవాంచిత ఘటనలు.. హత్య.. ముసుగు మనిషి.. ఏవేవో ఊహించని సంఘటనలు ..భయం.. థ్రిల్.. ఇదంతా రొటీన్ గానే ఉంది. అయితే ఇందులో నయనతార నటిస్తోంది అన్నదే ఆసక్తికరమైన పాయింట్. యువన్ శంకర్ రాజా లాంటి ట్యాలెంటెడ్ సంగీత దర్శకుడు రీరికార్డింగ్ పెద్ద ప్లస్ కానుంది.

తమిళంలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అన్ని థ్రిల్లర్లలానే రొటీన్ సంఘటనలు.. స్క్రీన్ ప్లేతో చూపిస్తే ఇదో సాధాసీదా సినిమాగానే నిలుస్తుంది. మన ఆడియెన్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రతాప్ పోతన్- రోహిణి హట్టాంగుడి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు.
Please Read Disclaimer