నాలుగేళ్లు ప్రేమలో నలిగిపోయారు

0

విఘ్నేష్ తో నయన్ ప్రేమాయణం తెలిసిందే. ఈ జంట సహజీవనం బహిరంగమే. నేడో రేపో పెళ్లి అంటూ రెండేళ్లుగా ప్రచారం సాగుతున్నా అది ఎప్పుడో తేలలేదు ఇంకా. ఇక ఈ జోడీ ప్రేమలో పడిన తరుణం గుర్తు చేసుకోవాలంటే.. `నానుమ్ రౌడీ తాన్` అనే తమిళ సినిమా సెట్స్ లో ప్రేమ కుదిరింది. ఇందులో విజయ్ సేతుపతి- నయనతార జంటగా నటించగా విఘ్నేష్ దర్వకత్వం వహించాడు. ఈ సినిమా రిలీజై నేటితో నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా విఘ్నేష్ ఆ సంగతిని సోషల్ మీడియాలో గుర్తు చేశాడు.

అంతేకాదు నయన్ కి కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితంలోకి ప్రవేశించిన నయన్ ఒక మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాడు. నయన్ ఎప్పుడూ ఇలానే ఇన్నర్ బ్యూటీతో ఉండాలని నయన్ కి చెప్పాడు. ఇన్నర్ బ్యూటీ ఔటర్ బ్యూటీ ఎప్పటికీ ఇలానే నీతో ఉంచుకో.. టన్నులకొద్దీ నీపై ప్రేమ ఉంది! అంటూ తన ఫీలింగ్ ని ఓపెన్ అయ్యాడు.

నాలుగేళ్ల సుదీర్ఘ ప్రేమాయణంలో ఈ జంట అన్యోన్యత గురించి తెలిసిందే. ఇప్పటికీ ప్రేమలోని సౌఖ్యాన్ని ఆస్వాధిస్తున్నారు. నయన్ ఓవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్నా విఘ్నేష్ కి కావాల్సినంత స్పేస్ ని ఇస్తుండడం వల్లనే ఈ బాండింగ్ కుదిరింది. విఘ్నేష్ ప్రస్తుతం దర్శకుడిగా ఓ సినిమా తీసేందుకు ప్రిపరేషన్ లో ఉన్నాడు. నయన్ కథానాయికగానూ ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.