దీపావళికి NBK 105 ట్రీట్ ఏంటో తెలుసా?

0

దీపావళి కానుకగా అంటూ టాలీవుడ్ స్టార్స్ చాలా హంగామా చేయబోతున్నారు. పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు కీలక ప్రకటనలు.. టీజర్ లు.. పాటలు ఇలా చాలా విడుదల కాబోతున్నాయి. ఇదే సమయంలో దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటన చేసి నందమూరి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాడు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

రూలర్ తో పాటు ఇంకా పలు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం టైటిల్ విషయమై దీపావళికి క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈనెల 26న బాలకృష్ణ 105వ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రివీల్ చేసి మోషన్ పోస్టర్ ను దీపావళి కానుకగా నందమూరి ఫ్యాన్స్ కు ట్రీట్ గా ఇవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. బాలయ్య గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిన నేపథ్యంలో ఈ చిత్రంపై ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఎన్టీఆర్’ చిత్రం రెండు పార్ట్ లు కూడా బాలయ్యను నటుడిగా.. నిర్మాతగా నిరాశ పర్చాయి. ఆ ఫలితం నుండి బయట పడేందుకు కాస్త గ్యాప్ తీసుకున్న బాలయ్య ఒక మంచి సబ్జెక్ట్ తో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్ మరియు వేదికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా రాబోతున్న ఫస్ట్ లుక్ తో విడుదల తేదీపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది.
Please Read Disclaimer