నేల టికెట్ భామ.. బాల్కనీ స్టైలు

0

ముంబై భామ మాళవిక శర్మ పేరు చాలా తక్కువమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈ భామ చేసిందే తెలుగులో ఒక సినిమా. అదే మాస్ మహారాజా రవి తేజ సినిమా ‘నేల టికెట్’.. అది కాస్తా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. అందుకే ఎక్కువమందికి పాప పరిచయం ఉండదు. అయితే సోషల్ మీడియాలో హాట్ టేస్ట్ ఉండే నెటిజన్లకు మాత్రం ఈ బ్యూటీ పేరు తెలిసే ఉంటుంది. ఎందుకంటే మాళవిక సోషల్ మీడియాలో హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు.

ఈ భామ రీసెంట్ గా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ముంబై మీడియా చాలా ఫాస్టు కదా.. అక్కడ ఏమాత్రం అందం కనిపించినా మిల్లీ సెకండ్లలో తమ కెమెరాల్లో బంధిస్తారు. ఇక ఈ భామ హాట్ నెస్ ను పోతపోసినట్టు ఉండే అందం. అందుకే వెంటనే ఫోటోలు తీసి.. క్షణం కూడా ఆలస్యం కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేశారు. ఈ ఫోటోలో మాళవిక ఒక స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించింది.. బ్లూ కలర్ బాటమ్.. తో చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా నడిచింది. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్ తప్ప ఇతర యాక్సెసరీస్ ఏవీ ధరించలేదు. మినిమమ్ మేకప్.. లూజ్ హెయిర్.. కళ్ళకేమో స్టైలిష్ గాగుల్స్ తో మోడరన్ భామ అనిపించుకుంది. ఇలానే ఎయిర్ పోర్ట్ లో ఎక్కువసేపు ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుందేమో!

మరి ఇంత స్టైలిష్ గా.. సెక్సీగా ఉన్న భామకు ఎందుకో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ‘నేల టికెట్’ తర్వాత మరో సినిమాలో ఈ భామ నటించలేదు. అయితే ఈమధ్య ఒక యువహీరో సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందనే టాక్ వినిపించింది. అది నిజమో కాదో తెలియాలంటే మాత్రం మనం కొన్నిరోజులు వేచి చూడకతప్పదు.
Please Read Disclaimer