ఏంటమ్మా అక్రమ సంబంధాలకు మద్దతిస్తున్నావా?

0

బాలీవుడ్ హీరోయిన్.. బుల్లి తెర హోస్ట్ నేహా దుఫియాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇల్లీగల్ ఎఫైర్స్ కు ఈమె మద్దతుగా నిలుస్తుందంటూ నెటిజర్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే… నేహా దుఫియా ప్రస్తుతం రోడీస్ రెవల్యూషన్ అనే ప్రముఖ రియాల్టీ షో లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఆ షోలో ఈమె లీడర్ పాత్ర పోషిస్తుంది. ఈ సందర్బంగా ఈమె ఒక వ్యక్తిపై సీరియస్ అయ్యింది.

అతడు తన మాజీ ప్రేయసిని చెంప దెబ్బ కొట్టినట్లుగా చెప్పడంతో అతడిపై నేహా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆడవారిపై చేయి చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అతడిని ప్రశ్నించింది. అందుకు అతడు సమాధానంగా నాతో ప్రేమలో ఉన్నట్లుగా నటిస్తూ అయిదుగురితో అక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే ఆమెను కొట్టినట్లుగా అతడు నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఆడవారిని కొట్టడం కరెక్ట్ కాదంటూ నేహా అతడిపై కామెంట్స్ చేసింది.

నేహా తీరుపై నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి అయిదుగురితో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్న అమ్మాయిని కొట్టకుండా ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. కొట్టడం తప్పు అంటున్నావంటే నీవు అక్రమ సంబంధాలకు మద్దతు ఇస్తున్నావా.. ఒక అమ్మాయి ఎంత మందితో అయినా సంబంధంలో ఉండవచ్చు అనేది నీ అభిప్రాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తనపై వస్తున్న ట్రోల్స్ కు నేహా స్పందిస్తూ తాను అక్రమ సంబంధం కరెక్ట్ అనలేదు. మహిళలను శారీరకంగా కొట్టడం తప్పు అన్నాను. మహిళల భద్రత విషయంలో నేను మాట్లాడాను తప్ప మరే ఉద్దేశ్యం తనకు లేదు అంటూ ఒక లేఖను నేహా విడుద చేసింది. ఇక నేహా దుఫియా భర్త అంగద్ బేడీ కూడా తన భార్యకు సపోర్ట్ గా నిలిచాడు. ఆమెను సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తున్న వారికి సోషల్ మీడియా ద్వారా సున్నితంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-