టాలీవుడ్ లో మరీ ఇంతటి దారుణ పరిస్థితి ఉందా?

0

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. ఇలా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా హీరోల ఆధిపత్యం కనిపిస్తున్న విషయం తెల్సిందే. సినిమాల్లో హీరోలకే అగ్ర తాంబూలం మరియు వారి పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండటం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. హీరోల పారితోషికం లో కొందరు హీరోయిన్స్ కనీసం 10వ వంతు కూడా తీసుకునే పరిస్థితి లేదు. ఇది అన్ని చోట్ల కనిపిస్తుంది. కాని షూటింగ్ స్పాట్ లో హీరోలకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి తాజాగా నేహా దూపియా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం ను కలిగిస్తున్నాయి.

బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా సినిమాలు చేసిన నేహా దూపియా ప్రస్తుతం ఒక టాక్ షోకు హోస్టింగ్ చేస్తుంది. ఇటీవల ఒకానొక సందర్బంగా నేహా మాట్లాడుతూ దక్షిణాది సినిమా పరిశ్రమపై సంచలన వ్యాక్యలు చేసింది. అక్కడ హీరోలకు ఇచ్చే ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుందని.. ఇతర భాషల్లో కూడా హీరోలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కాని సౌత్ లో మాత్రం అది మరీ అతిగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవంను పంచుకుంది.

ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో ఆకలిగా ఉందని భోజనం చేసేందుకు సిద్దం అయ్యాను. కాని హీరో ఇంకా వచ్చి తినలేదని.. ఆయన షూట్ లో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆయన తింటే ఆ తర్వాత అందరు తినాలంటూ ప్రొడక్షన్ వారు అన్నారట. ఆ మాటతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందట. అప్పటికే నాకు బాగా ఆకలి గా ఉంది. ఆ హీరో షూట్ లో ఉండటం తో ఆలస్యం అయ్యింది. టాలీవుడ్ షూటింగ్ స్పాట్ లో హీరో మొదట తిని ఆ తర్వాత అందరు తినే పరిస్థితులు ఉన్నాయంటూ నేహా లేవనెత్తిన ఇష్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. టాలీవుడ్ లో మరీ ఇలాంటి దారుణ పరిస్థితి ఉందా అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు.
Please Read Disclaimer