హవాయి సన్నాయి కంటిన్యూ

0

నేహ శర్మ పేరు తెలియని నెటిజన్లు చాలా తక్కువమంది ఉంటారు. ఎందుకంటే ఈ భామకు సినిమా హీరోయిన్ ద్వారా వచ్చిన గుర్తింపు కంటే సెక్సీ భామగా హాట్ ఫోటో షూట్లతో ఇన్స్టా ద్వారా తెచ్చుకున్న గుర్తింపే ఎక్కువ. ప్రస్తుతం ఈ భామకు ఇన్స్టాలో 8.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. సూపర్ హిట్లతో దూసుకుపోయే భామకు ఈ నంబర్ సాధారణమే కానీ పెద్దగా విజయాలు లేని భామకు ఈ ఫాలోయింగ్ ఎక్కువే. ఇదంతా హాటు ఫాలోయింగ్!

అందుకే తన అభిమానులను ఎప్పుడూ నిరాశపరచదు. రోజూ హాటు సన్నాయి వాయిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ హవాయి ద్వీపంలో ఫుల్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అది మనకు తెలియాలి కదా. అందుకే ఈరోజు కూడా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ లో కొటేషన్లు ఏవీ ఇవ్వలేదు కానీ హ్యాష్ టాగ్స్ తగిలించింది.. #షాట్ ఆన్ ఐ ఫోన్ 11 ప్రో మ్యాక్స్ #మై న్యూలీ అటెయిన్డ్ హవాయియన్ టాన్” అంటూ వివరించింది. అర్థం అయిందిగా.. ఐ ఫోన్ 11 తో తీసిన ఫోటో. రెండో హ్యాష్ టాగ్.. హవాయి ఎండల్లో శరీరం కాస్త టాన్ అయ్యి బ్రౌన్ గా కనిపిస్తోందట. ఇక ఫోటో విషయానికి వస్తే ఒక అందమైన రెడ్ కలర్ గౌన్ లో ఒక బెడ్ పై కూర్చుంది. థై స్లిట్ గౌన్ కావడంతో కాలి అందాలు. స్లీవ్ లెస్ కావడంతో భుజాల అందాలు బైట పడ్డాయి. నేహ కళ్ళు మూసు మూసుకుని ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ చిరు నవ్వు నవ్వింది. బెడ్ వెనక ఉండే వాల్ పేపర్ అందంగా ఉండడంతో ఫోటో మరింత అందంగా మారింది.

ఈ ఫోటోకు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. “నైస్ డ్రెస్.. రెడ్ హాట్”.. “హవాయి వేధిస్తున్నావు”.. “పట్టులాంటి చర్మం” అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘తైష్’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer