చిరుత భామ గ్లామర్ దాడి

0

కొన్ని పేర్లలోనే వైబ్రేషన్ ఉంటుంది. నేహ కూడా అలాంటి పేరే. ‘చిరుత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నేహ శర్మ సినిమాలలో పెద్దగా సాధించిందేమీ లేదు కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం దాదాపు 10 మిలియన్ల ఫాలోయర్లను సంపాదించుకుంది. వారికోసం రెగ్యులర్ గా ఫోటో షూట్లు చేస్తూ వాటిని అభిమానులకు పోస్ట్ చేస్తూ తెగ యాక్టివ్ గా ఉంటుంది.

నేహ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు రెండు పువ్వుల ఎమోజిలు మాత్రం క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో నేహ లైట్ కలర్ శాటిన్ ప్యాంట్.. అదే కలర్ కోటు లాంటి షర్టు ధరించింది. ఆ పొడవాటి షర్టుకు బటన్లు పెట్టుకోకపోవడంతో నేహ అంతః సౌందర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నెటిజన్లను జిల్ జిల్ మనిపించేలా చేస్తోంది. ఒక చేతిని జేబులో పెట్టుకుని ఎంతో స్టైల్ గా నిలుచుంది. లూజ్ హెయిర్ తో.. అతి తక్కువ మేకప్ తో ఓ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ ఫోటోకు నేహ చెల్లి ఐష శర్మ ఓ లైక్ వేసుకుంది. సాధారణ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “ఏక్ నంబర్”.. “మోడరన్ అలిఫ్ లైలా”.. “జబర్దస్త్ ” అంటూ కొందరు స్పందించారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘తైష్’ అనే హిందీ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా తో పాటుగా ‘ఇక్ సాందు హుండా సీ’ అనే పంజాబీ సినిమా లో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer