నేహ వదలడం లేదుగా

0

‘చిరుత’ భామ నేహ శర్మ సినిమాల్లో పెద్దగా సాధించింది ఏమీ లేదు కానీ సోషల్ మీడియాను ఫుల్లుగా వాడడంతో భారీగా అభిమానులను సంపాదించింది. ప్రస్తుతం ఈ భామకు ఇన్స్టాలో 8.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఇక హాటు ఫోటో షూట్లు అనేవి ఈ భామ జీవితంలో విడదీయలేని భాగం అయ్యాయి. అందుకే ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉంటుంది.

ఈమధ్య నేహ హవాయి ట్రిప్ వేసింది. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. మరి తిరిగి ముంబై వచ్చిందో లేదా ఇంకా అక్కడే ఉందో తెలియదు కానీ ఆ ట్రిప్ ఫోటోలను తెగ షేర్ చేస్తోంది. ఈ ఫోటోలో ఒక అందమైన ఎరుపు రంగు గౌన్ లో అలా నిలుచుంది. ఎక్కడైనా ప్రపంచంలో వీ నెక్ ఉంటుంది. కానీ ఈ డ్రెస్సుకు మాత్రం M నెక్ ఉంది. ఆ మహా కళా తపస్వి అయిన దర్జీ ఎవరో కానీ అతనికి అందాల వందనాలు తెలియజేసుకోవాలి. ఇలాంటి డిజైన్లు లేకపోతే అందాల విందు ఎలా జరుగుతుంది? మొహంపై పడుతున్న జుత్తు.. ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ మహా రొమాంటిక్ గా ఉంది.

ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది చాలా సహజంగా జరిగేదే. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అజయ్ దేవగణ్ సినిమా ‘తానాజీ’ లో నటిస్తోంది. మరో సినిమా ‘తైష్’లో కూడా నటిస్తోంది. ఈ రెండూ సినిమాలే కాకుండా ‘ఇక్ సాంధు హుండా సి’ అనే పంజాబీ సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer