మళ్లీ నేహా హీటెక్కించేస్తోంది

0

కొంత మంది ఏం చేసినా.. ఎంతగా ఎట్రాక్ట్ చేయాలని ప్రయత్నాలు చేసినా వారికి అవకాశం అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. ఎంత గ్లామర్ వున్నా… ఆ గ్లామర్ తో ఎంత రెచ్చిపోయి అందాల ప్రదర్శించినా ఒక్క ఛాన్స్ కూడా దక్కడం కష్టమే. అలాంటి పరిస్థితినే రామ్ చరణ్ హీరోయిన్ ఎదుర్కొంటోంది. రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం `చిరుత`. క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బీహారీ చిన్నది నేహాశర్మ.

మెగాస్టర్ తనయుడి సినిమా.. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసినా తెలుగులో పెద్దగా రాణించలేకపోయింది. వరుణ్ సందేశ్తో కలిసి `కుర్రాడు` చిత్రంలో మెరిసినా నేహాకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ తరువాత బాలీవుడ్ వెళ్లినా అక్కడా పెద్దగా రాణించలేకపోతోంది. దీంతో సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలని షేర్ చేస్తూ యంగ్ తరంట్స్ ని బాలీవుడ్ బిగ్ హీరోస్ ని బుట్టలో వేయాలని తెగ ఆపసోపాలు పడుతోంది.

ఆదివారం బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ అందాల విందు చేస్తున్న ఓ ఫొటోని మరోసారి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకి 6 లక్షల పైచిలుకు వ్యూస్ రాగా ఏడు వేల పైచిలుకు కాంట్స్ రావడం గమనార్హం. సినిమాల్లో పాపులర్ కాలేకపోయిన నేహాశర్మ తన హాట్ హాట్ అందాలని ఇన్స్టాలో నెటిజనులకు ఎరవేస్తూ నిత్యం వార్తల్లో వుండటంతో మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని బాలీవుడ్ జనాలు చెబుతున్నారు. నేహా ప్రస్తుతం `హేరా ఫేరీ-3`లో నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్రంతో అయినా నేహా సుడితిరుగుతుందేమో చూడాలి.
Please Read Disclaimer