శర్మ సిస్టర్స్ టూమచ్ హాట్

0

అజయ్ దేవగన్ టైటిల్ పాత్ర పోషించిన `తానాజీ` చిత్రంలో నటించింది నేహాశర్మ. వారియర్ మూవీలో అందాల రాకుమారిగా అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్టయ్యింది. ప్రస్తుతం థైస్ అనే చిత్రంతో పాటు ఓ పంజాబీ చిత్రంలోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఈ అమ్మడికి కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ అవకాశాలే వస్తున్నాయట. వూట్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్ తో ట్రీటివ్వబోతోంది. ఇదేగాక.. పంజాబీలో ఓ సినిమా.. హిందీలో మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది అమ్మడు.

ఇక పనిలో పనిగా తన సోదరి ఐషా శర్మను పెద్ద స్టార్ ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఐషా శర్మకు అవకాశాలు రప్పించేందుకు సిస్టర్ నేహా చేయని ప్రయత్నమే లేదు. ఇప్పటికే శర్మ సిస్టర్స్ కి సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అక్కడ సోదరి ఐషా ని ప్రమోట్ చేస్తోంది. అందుకోసం ఇదిగో ఇలా తంటాలు పడుతోంది.

హోమ్ జిమ్ లో రెగ్యులర్ గా కసరత్తులు చేస్తున్న సిస్టర్స్ ఇదిగో ఇలా వేడెక్కించేస్తున్నారు. దేహశిరుల అందాల్ని రెట్టింపు చేసే టైట్ ఫిట్ స్పోర్ట్స్ డ్రెస్ లో సిస్టర్స్ అగ్గి రాజేస్తున్నారు. ప్రస్తుతం కరోనా హాలీడేస్ నేపథ్యంలో శర్మాగాళ్స్ నెటిజనులకు అన్ లిమిటెడ్ ట్రీట్ ని ప్లాన్ చేశారు మరి. అయితే శర్మా సిస్టర్స్ మరీ ఇంతగా అతి చేయాలా? ఎక్సర్ సైజులు పేరు తో సైజుల షోలు ఎందుకు? అంటూ సీరియస్ కామెంట్లతోనే నెటిజనం విరుచుకు పడుతున్నారు.
Please Read Disclaimer