చిరుత బ్యూటీ మరో సారి!

0

గొప్పగా స్టార్ స్టేటస్ అందుకో లేకపోయిన కొంత మంది హీరోయిన్లు ఈమధ్య ఆ కక్షను ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్ల మీద తీర్చుకుంటున్నారు. హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ వారి మనసులను అల్లకల్లోలం చేసే సునామీలను సృష్టిస్తున్నారు. ఇలాంటి సునామీ క్రియేటర్స్ బ్యాచ్ లో నేహ శర్మ ఒకరు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగులో ‘చిరుత’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హిందీలో ఇప్పుడూ ఒకటిఅరా అవకాశాలు ఉన్నాయి కానీ దృష్టి మాత్రం ఇన్స్టా పైనే ఉంటుంది.

ప్రస్తుతం హవాయి ద్వీపంలో మాకెనా బీచ్ లో సరదాగా గడుపుతోందట. ఇక చూసుకోండి. అసలే బికినీ షేప్ లో ఉండే భామ.. బీచిని చూస్తే బికినీ వేయాలని అనిపిస్తుంది. జలకాలాటలు ఆడాలి.. ఫోటోలు తీసుకోవాలి ఆ ఫోటోలతో నెటిజన్ల దుంప తెంచాలి.. అనే ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలే వచ్చాయేమో కానీ వెంటనే వాటిని ఆచరణలో పెట్టింది. ఒక కత్తిలాంటి ఫోటో పోస్ట్ చేసి “హవాయి” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో బ్లాక్ బికినీలో శిరోజాలను సవరించుకుంటూ నిలుచుంది. మొహంపై పడిన ఎండ.. వీపుపై పడిన నీడ ను చూస్తే నేహ స్కిన్ టోన్ కు ఎవరైనా ఫిదా కావడం ఖాయం. ఆ పెదవులు.. ముక్కు.. కళ్ళు.. అబ్బా సూపర్. జక్కన్న బాహుబలిని చెక్కినట్టు బ్రహ్మదేవుడు ఈ హాటుబలిని చెక్కి ఉంటాడేమో అనిపిస్తోంది.

ఈ పోస్ట్ కు మంచి కామెంట్లే వచ్చాయి. “ఇంత హాటుగా ఎలా?”.. “సూపర్ క్లిక్”.. “ఫెంటాస్టిక్ లుక్స్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. మరి కొందరేమో ఫైర్ ఎమోజిలు పెట్టారు. ఇక నేహ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయాని కి వస్తే ‘తైష్’ అనే బాలీవుడ్ చిత్రం లో నటిస్తోంది.
Please Read Disclaimer