ఈసారి వర్మ టార్గెట్ కేఏ పాల్

0

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం రాజకీయంగా వివాదాన్ని సృష్టిస్తోంది. వర్మ మాత్రం ఇది పూర్తిగా వివాదరహిత చిత్రం అంటూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇందులో ఎవరిని ఉద్దేశించి పాత్రలు పెట్టలేదు అంటూ చెబుతున్నాడు. ఎవరికి వారు ఊహించుకోవద్దంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వర్మ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి సెన్షేషన్ క్రియేట్ చేసిన వర్మ ఈసారి నేనే కేఏ పాల్ అనే పాటతో వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

నేనే కేఏ పాల్ అంటూ సాగే పాటను నవంబర్ 2 ఉదయం 9 గంటల 36 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. దాంతో పాటు రేపటి పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను కూడా వదిలాడు. ఆ ప్రోమోలో కాస్త ఫన్నీగా వాయిస్ ఓవర్ ఉంది. ఆ వాయిస్ ఎవరిదో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఆమద్య ఎన్నికల సమయంలో కేఏపాల్ మరియు రామ్ గోపాల్ వర్మల మద్య వివాదం రాజుకుంది.

ఒకప్పుడు వర్మ నా కాళ్లు మొక్కాడు అంటూ కేఏపాల్ వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలను తీవ్రంగా కొట్టి పారేశాడు వర్మ. ఆ తర్వాత కూడా ఇద్దరి మద్య మాటల యుద్దం సాగింది. అప్పుడే కేఏ పాల్ పై సినిమా చేస్తానంటూ ప్రకటించిన వర్మ ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఆయన పాత్రను కీలకంగా పెట్టి ఉంటాడు అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
Please Read Disclaimer