లక్ష్మీస్ ఎన్టీఆర్: ఈ పాట ఏంటి రాజా?

0

లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆర్జీవీ ప్రకటించిన సమయంలో ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ మెల్లగా ప్రమోషన్స్ మొదలు పెట్టేసరికి తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలే ఎలెక్షన్ సీజన్ కావడంతో ఈ సినిమాకు ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రోమో మెటీరియల్స్ అంతా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై ఆసక్తిని పెంచాయి.

‘వెన్నుపోటు’ కానీ మరోటి కానీ పాటల క్వాలిటీ మొదటి నుంచి కాస్త అటూ ఇటుగానే ఉంది. అయితే వాటిలో కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం తో ఎవరికీ కంప్లయింట్స్ లేవు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ‘నేనేం చేశానో’ పాట మాత్రం కాస్త ఆడియన్స్ ను హడలెత్తించేలాగానే ఉంది. లక్ష్మీపార్వతి బాధగా ఉన్న సమయంలో వచ్చే పాట కాబట్టి ఉండే ఎమోషనల్ గా అయినా ఉండాలి లేదా మెలోడియస్ గా అయినా ఉండాలి కానీ ఈ పాట మాత్రం అటూ ఇటూ కాకుండా ఉంది. అటు లిరిక్స్ కానీ ఇటు ట్యూన్ కానీ ఆకట్టుకునేలా ఉండకపోవడం ఒక ఎత్తైతే.. విజువల్స్ లో ఉన్న ఓవర్ మెలోడ్రామా కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా లేదు.

సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కిస్తున్నారని చెప్పినప్పుడు.. ఆ కథలో ప్రతి అరగంటకూ ఒక పాటను ఎవరూ ఆశించరు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో ఎవరైనా స్టొరీని.. డైలాగులను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటప్పుడు సినిమా ఫ్లోలో ఇలాంటి పాటలు పంటి కిందరాయిలా అడ్డుపడేవే. అయినా గురుడు రిలీజ్ చేశాడు కాబట్టి ఒక లుక్కేసుకోండి. ఏమో గుర్రం ఎగరా వచ్చు ఈ కళాఖండం మీకు నచ్చావచ్చు
Please Read Disclaimer