భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

కరోనా కల్లోలం: టీవీ మూవీ కార్మికులకు 800 కోట్లు ప్యాకేజీ

0

కరోనా ప్రభావిత దేశాలన్నీదాదాపు బంద్ పాటిస్తున్నాయి. దీంతో అన్ని భాషల చిత్ర పరిశ్రమలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ పెను విపత్తు వల్ల రోజువారి కూలీపై ఆధారపడే సినీ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వారిని ఆదుకునే నాదుడే లేదు. ప్రభుత్వంగానీ… సినీ పెద్దలు.. నిర్మాతలు ఎవరూ స్పందించలేదు. టాలీవుడ్ లో హీరో రాజశేఖర్ ముందుకొచ్చి తనవంతు సాయం అందిస్తామని ప్రకటించారు. ఉపాధి కోల్పోయి తిండికి లేని ఆర్టిస్టులకు సాయం అందిస్తానని ముందుకొచ్చారు. ఇక ఈ విపత్తుపై మునుముందు అగ్ర హీరోలు స్పందించే అవకాశం ఉంది.

తాజాగా డిజిటల్ రంగంలో అతి పెద్ద ఫ్లాట్ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సైతం తన ఔదార్యాన్ని చాటుకుంది. కరోనా వల్ల ఆగిపోయిన సినిమా.. టీవీ రంగాల కార్మికులను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకోసం దాదాపు వంద మిలియన్ డాలర్లని(765కోట్లు) సహాయార్థం ప్రకటించింది. ఈ విషయాన్నినెట్ ఫ్లిక్స్ ఛీప్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సరండాస్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని నెట్ ఫ్లిక్స్ కోసం పనిచేసే టీవీ.. సినిమా రంగానికి చెందిన కార్మికులకు అందజేయనున్నట్టు తెలిపారు. అందులో పదిహేను మిలియన్ డాలర్లని ఎమెర్జెన్సీ ఫండ్ గా విడుదల చేసింది. అన్నట్టు నెట్ ఫ్లిక్స్ యూరప్.. లాటిన్ అమెరికా… ఏసియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నవిషయం తెలిసిందే.

మరి నెట్ ఫ్లిక్స్ మాదిరిగానే అమెజాన్ వంటి డిజిటల్ దిగ్గజాలు కూడా ప్రకటిస్తే బాగుంటుందనే వాదన ప్రారంభమైంది. అలాగే సినిమా రంగానికి చెందిన పెద్దలు.. టీవీ దిగ్గజాలు కూడా తమ కార్మికులకు ఎంతో కొంత సహాయాన్ని ప్రకటించాలని కోరుతున్నారు. మరి స్వచ్ఛందంగా వారు వచ్చి ప్రకటిస్తే సినీ కార్మికులు కాస్తయినా ఊపిరిపీల్చుకుంటారని చెప్పొచ్చు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-