వివాదంలో మాజీ క్రికెటర్ యువీ: ట్విటర్ లో క్షమాపణ కోసం డిమాండ్లు

0

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అతడి ఎప్పటి వీడియోనో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని ఈ స్టార్ ఆల్ రౌండర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. కుల అహంకారంతో యువరాజ్ వ్యాఖ్యలు చేశాడని.. వెంటనే క్షమాపణ చెప్పాలని #युवराज_सिंह_माफी_मांगो (యువరాజ్ సింగ్ మాఫీ మాంగే) అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో ఉంది.

రెండు నెలల క్రితం భారత క్రికెట్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో యువరాజ్ సింగ్ ఇన్‌స్టా లైవ్ నిర్వహించాడు. ఈ లైవ్‌లో మధ్యలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రావడంతో అతడి ఉద్దేశించి రోహిత్ యువి ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. చాహల్ టిక్ టాక్ వీడియోలను ప్రస్తావించారు. ఈ క్రమంలో యువరాజ్ ‘ఈ బాంగీ మనషుల్లా యూజీకి పనిపాట లేనట్లుంది. అతడి కుటుంబంతో చేసిన వీడియోలు చూశావా?’అని రోహిత్‌ను ప్రశ్నించాడు.

ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హిందీలో బాంగీ అంటే దళిత వర్గానికి చెందిన ఓ కులాన్ని పిలుస్తారు. వీధులు ఊడ్చే వారిని దిగువ స్థాయి కులాలకు చెందిన వారిని బాంగీగా పిలుస్తారు. యువరాజ్ సింగ్ అలాంటి పదాన్ని వాడడంతో వారిని కించపరిచాడని అనే అపవాదు వచ్చింది. రెండు నెలల కిందట వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యువరాజ్ సింగ్ క్షమాపణలు చెప్పాలని పెద్దసంఖ్యలో ట్వీట్ చేస్తున్నారు. గతంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కు సాయం చేయాలని కోరి విమర్శలను ఎదుర్కొన్న యువరాజ్ ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.

అయితే యువరాజ్ సింగ్ అలా వ్యాఖ్యలు చేయలేదని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. ఆ వీడియోలో బాంగీ కాదు బగ్గీ అన్నాడని వివరణ ఇస్తున్నారు. పంజాబీలో బగ్గీ అనేది ఓ సరదా పదమని పేర్కొంటున్నారు. స్వీట్ హార్ట్ డార్లింగ్ స్వీటీ అనే పదాలకు పర్యాయపదంగా బగ్గీ అని వాడుతారని చెబుతున్నారు. దీనిపై ఇంకా యువరాజ్ స్పందించలేదు. మరోసారి యువరాజ్ సోషల్ మీడియాకు బలయ్యాడు.
Please Read Disclaimer