హాలీవుడ్ యాక్టర్ పేరు చెప్పి మళ్లీ తిట్టేశాడు!

0

తొందరపాటుతో ఒకరు ఒక మాట అనేస్తే.. ఎదుటోడు కూడా అంతే దూకుడుగా ఒక మాట అనేస్తే ఏం లాభం? ప్రముఖులు ఆలోచించినంత గొప్పగా సామాన్యులు ఆలోచించలేకపోవచ్చు. వారి ఇరుకు మైండ్ సెట్ తో మాట్లాడినప్పుడు విశాల భావాలున్న ప్రముఖులు ఓపిగ్గా తనవాళ్లకు అర్థమయ్యేలా విషయాన్ని విప్పి చెప్పాలి కదా? కానీ.. అందుకు భిన్నంగా ఫైర్ కావటంలో అర్థం లేదేమో మనోజ్.

ఇదంతా ఎందుకంటే.. చెన్నైలో చోటు చేసుకున్న మహా నీటి ఎద్దడి నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ప్రస్తావిస్తూ.. తన వంతుగా తాను సాయం చేశానని మనోజ్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు పలువురు నెగిటివ్ గా రియాక్ట్ అయి.. మనోజ్ ను తిట్టారు. తెలుగు ప్రజలు అవసరాల్లో ఉన్నప్పుడు చెన్నై ప్రజలు మనకు ఆహారం.. నీరు.. వసతి కల్పించారని.. మనం సాయం చేయాల్సిన సమయం వచ్చేసిందని.. దేశంలోనే అది పెద్ద నగరాల్లో ఒకటైన చెన్నైలో నీటి సమస్య ఎదురైంది.. ఆదుకోండంటూ మెసేజ్ పోస్ట్ చేశారు.

దీనిపై నెగిటివ్ రియాక్షన్ రావటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా హాలీవుడ్ నటుడు కమ్ పర్యావరణవేత్త అయిన లియోనార్డో డికాప్రియో ఇన్ స్టాగ్రామ్ లో చెన్నై నీటి ఎద్దడి తెలిపే ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి విచారం వ్యక్తం చేశారు. సాయం చేయాలన్న రీతిలో మాట్లాడారు. దీంతో మనోజ్ మరోసారి తెర మీదకు వచ్చారు. తాను చెన్నైకి సాయం చేయటాన్ని కొందరు వ్యతిరేకిస్తూ కామెంట్లు చేశారని.. ఇలాంటి తీరుకు సిగ్గుపడాలన్నారు. మనమంతా భారతీయులం.. దానికంటే ముందు మనుషులమని.. చెన్నై వాసుల మీద హాలీవుడ్ నటుడికి ఉన్న జాలి కూడా మీకు లేదంటూ మండిపడ్డారు. మానవత్వాన్ని దయచేసి చంపొద్దని.. అవసరాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు జాతి.. కులం.. రాష్ట్రం అన్న తేడాలు చూడొద్దని ట్వీట్ చేశారు.

నిజమే.. మనోజ్ చెప్పిన దాన్లో నిజం ఉంది. కాకుంటే.. ఇదే విషయాన్ని దురుసుగా.. తిట్టిపోసేలా కాకుండా సున్నితంగా చెబితే బాగుంటుంది కదా? మనం ఉన్న మైండ్ సెట్ లోనే అందరూ ఉండరు కదా మనోజ్. అందరిని కలుపుకొని వెళ్లేటప్పుడు కూసింత ఓపిక అవసరం. లేదంటే.. గుట్టుగా సాయం చేసి గమ్మున ఉంటే సరిపోతుంది. అంతేకానీ.. తిట్టిపోసేలా పోస్ట్ పెడితే రచ్చ రంబోలా కావటం మినహా మరింకేమీ ఉండదబ్బా!
Please Read Disclaimer