రేణూజీ మరీ ఇంత పొగరు పనికి రాదండోయ్

0

సోషల్ మీడియా ద్వారా స్టార్ సెలబ్రెటీ అయిన వారిలో సింగర్ రేణూ మోండల్ ఒకరు. రైల్వే స్టేషన్ లో పాటలు పాడుతూ వాళ్లు వీళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని జీవనం సాగించిన రేణూ మోండల్ ఇప్పుడు స్టార్ సెలబ్రెటీ అయ్యింది. ఆమె పాటకు ఫిదా అయిన నెటిజన్స్ ఆమెను స్టార్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె సెన్షేషన్ అవ్వడంతో ఆమెను బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ ఆధరించారు. పలువురు తమ సినిమాల్లో ఆఫర్లు ఇస్తే కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా ఇల్లే ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.

రేణూ మోండల్ కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ దక్కింది. దాంతో ఆమె ఎక్కడ కనిపిస్తే అక్కడ జనాలు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఆమె ప్రస్తుత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. కార్ల వద్ద పాటలు పాడుతూ అడుక్కున్న ఆమె ఇప్పుడు కార్లల్లో తిరుగుతుంది. ఎంత ఎదిగినా మనం వచ్చిన దారిని మర్చి పోవద్దని పెద్దలు అంటారు. కాని రేణూ మోండల్ తన రూట్స్ ను మర్చి పోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల ఒక షాపింగ్ మాల్ లో రేణూ మోండల్ ఉండగా ఒక లేడీ ఆమె వెనుక నుండి వెళ్లి చేయితో తట్టి పిలిచారు. ఒక సెల్ఫీ కావాలంటూ ఆ అభిమాని అడిగింది. వెనుక నుండి చేయితో తట్టినందుకు రేణూ మోండల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వెనక్కు తిరిగి రేణూ మోండల్ ఆ అభిమానిపై తీవ్ర కోపంను ప్రదర్శించింది. నన్ను తట్టి పిలవడం ఏంటీ.. నన్ను ఎందుకు ముట్టుకున్నావు అంటూ కోపం వెళ్లగక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒకప్పుడు ఆమె పరిస్థితి ఏంటీ.. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఏంటీ అంటూ కంపైర్ చేస్తూ నెటిజన్స్ రేణూ మోండల్ పై ట్రోల్స్ చేస్తున్నారు. కాస్త సెలబ్రెటీ స్టేటస్ రాగానే ఆమెలో పొగరు పెరిగి పోయిందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే.. ఈమె ఇలాగ ఉంటే సల్మాన్ ఖాన్.. దీపిక పదుకునే వంటి బాలీవుడ్ స్టార్స్ ఇంకా ఏ స్థాయిలో పొగరు చూపించాలి.. వారు అభిమానులతో ఎలా ఉండాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే రాణూ మోండల్ ఎంత స్పీడ్ గా సెలబ్రెటీ అయ్యిందో మళ్లీ అంతే స్పీడ్ గా రైల్వే స్టేషన్ కు వెళ్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer