నీ తొడలు పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు….!

0

తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా మారిన రచయితలకు మంచి క్రేజ్ ఉంది. పోసాని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ మొదలైన వారు ఈ కోవకే చెందుతారు. వీరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ది ప్రత్యేక శైలి. తన మాటలతోనే సినిమాను నడిపించగల సత్తా ఉన్న రచయిత. రచయితగా మంచి విజయాలను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యారు. నువ్వే నువ్వే అతడు జల్సా జులాయి అత్తారింటికి దారేది అ ఆ మరియు అరవింద సమేత…వంటి విజయవంతమైన చిత్రాలు అందించారు. ఇటీవల విడుదలైన ‘అల వైకుంఠపురంలో’ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకుందీ ఈ చిత్రం. అయితే విజయవంతమైన ఈ చిత్రాన్ని విమర్శించే వాళ్ళూ లేకపోలేదు. 1956లో విడుదలైన రామారావు నటించిన ‘ఇంటిగుట్టు’ చిత్రాన్ని పోలివుందని సినీ విమర్శకులు విమర్శించారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే పాత్రను త్రివిక్రమ్ చూపించిన విధానం చాలా మందికి నచ్చలేదు. పూజాహెగ్డే పాత్ర సినిమాలో కనిపించడంతోనే ఆమె తొడల మీద ఫోకస్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఏకంగా ఆమె తొడలు చూపిస్తూ ఒక సాంగ్ కూడా ఈ సినిమాలో ఉంది. దీని గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా విమర్శించారు. “నీ కాళ్ళను పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు..” అని కాకుండా “నీ తొడలు పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు…” అని రాస్తే బాగుండేది అని కామెంట్ చేసారు.

మరికొంత మందైతే తన రచనలతో ‘మాటల మాంత్రికుడు’ ‘గురూజీ’ గా పిలవబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ రాను రాను “లీకేజీ”గా మారిపోతున్నారని విమర్శిస్తున్నారు. రాబోయే చిత్రాలలో అయినా త్రివిక్రమ్ ఇలాంటివి ఫోకస్ చేయకుండా ఉంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన త్రివిక్రమ్ ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక డబ్బున్న అమ్మాయి ప్రేమను పొందడానికి తన కాళ్ళను మాత్రమే ఆస్వాదిస్తాడని ఆ నేపథ్యంలోనే ఇలాంటి సీన్స్ పెట్టానని వివరించారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-