మంచి పనిని ఎలాగూ ప్రమోట్ చేయరు.. మంచి ఫోటోలైనా పెట్టండి ప్లీజ్

0

పూనమ్ కౌర్.. సినిమాలతో కంటే వివాదాలతో బాగా గుర్తింపు పొందిన హీరోయిన్. ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్.. అడపాదడపా సినిమాల్లో నటించింది. ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. తెలుగుతో పాటు కన్నడ తమిళ భాషల్లో సినిమాలు కూడా చేసింది. అయితే ఆమె తన సినిమాల కంటే పలు వివాదాలతో పాపులర్ అయ్యింది. పూనమ్ కౌర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా రకరకాల అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎప్పుడో దూరమైన ఈ అమ్మడు తరచూ డిఫరెంట్ మీనింగ్ వచ్చేలా ట్వీట్లు చేస్తుండటంతో ఎవర్ని ఉద్దేశించి చేస్తుంది.. ఎందుకు చేస్తుంది అనే ప్రశ్నలు తలెత్తుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ – జల్సా అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ గతంలో ఎన్నో ట్వీట్స్ చేసింది. ఇదెంత నిజమో తెలియకపోయినప్పటీ పూనమ్ కౌర్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది.

ఆ మధ్య కాలంలో కత్తి మహేష్ ఈ ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడిచిందంటూ కామెంట్ చేయడంతో పూనమ్ – పవన్ ఇష్యూ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. అంతేకాకుండా ఆమె చేసే పోస్ట్ లలో ‘PK LOVES’ అనే హ్యాష్ ట్యాగ్ ను తరుచుగా వాడటం.. అలాగే పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయన సినిమాలకు దగ్గరగా ఉండే పేర్లను వాడటం వల్ల రూమర్స్ పుట్టుకొచ్చాయి. దీనితో పూనమ్ కౌర్ ని పలు సందర్భాల్లో పవన్ అభిమానులు ట్రోల్ చేశారు కూడా. అయితే ‘PK’ అంటే ‘పూనమ్ కౌర్’ అని చాలాసార్లు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. తాను చేసిన ట్వీట్స్ ని మరో కోణంలో ప్రచారం చేయొద్దంటూ పూనమ్ పలు సందర్భాల్లో నెటిజన్లని కోరింది. పూనమ్ కౌర్ ఒక్కోసారి మీడియా పైనా ఫైర్ అవుతూ ఉంటుంది. పెయిడ్ మీడియా అని భజన బ్యాచ్ అంటూ సెటైర్స్ వేస్తూ ఉంటుంది.

ఇటీవల ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి.. పీకే లవ్స్ మాస్క్ ధరించి మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీని పై కామెంట్ చేసిన శ్రీరెడ్డికి ఇండైరెక్టుగా ట్వీట్ ద్వారా కౌంటర్ కూడా ఇచ్చింది. ”ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత.. ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత.. ఒక ప్రేయసి భార్యగా ఉండటం ఒక బాధ్యత.. బాధ్యత ప్రేమతో క్యారెక్టర్ తో వస్తది.. ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి.. డబ్బు అని క్యారెక్టర్ ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. ఇప్పటికైనా మనిషిగా మారు మృగం” అని ట్వీట్ చేసింది. ఇప్పుడు లేటెస్టుగా మరో ట్వీట్ తో వచ్చింది పూనమ్. ”ఈ వెబ్ సైట్స్ మంచి ఫోటోలను వాడాలి. నేను చేసే మంచి పనిని ఎలాగో ప్రోత్సహించరు.. కనీసం మంచి ఫోటోలను పెట్టి పబ్లిష్ చేయండి.. ఆంధ్రావాల్లు నా వెనకపడ్డారు.. బ్యాడ్ డే ఫోటోలను పెట్టకండి ప్లీజ్.. వార్తను వదిలేయండి కనీసం మంచి ఫోటోలనైనా పెట్టండి” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ఆంధ్రావాళ్ళు అని మెన్షన్ చేయడం పట్ల నెటిజన్స్ తీవ్ర స్థాయిలో అమ్మడిపై విరుచుకుపడుతున్నారు. మీ మంచి ఫోటోలు పబ్లిష్ చేయని వారిని అనండి.. అంతేకాని అందరిని అనడం ఏంటని కామెంట్స్ పెడుతున్నారు.
Please Read Disclaimer