నెటిజన్ల ఆగ్రహానికి గురైన బాలీవుడ్ బ్యూటీ…!

0

గత కొన్ని రోజులుగా అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం పట్ల ఆందోళనలు నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికాలోని మిన్నియాపోలిస్ లో మే 25 వ జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించడంతో రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు. జార్జ్ ఫ్లాయిడ్ నల్లజాతీయుడు కావడంతో ఇది జాతి వివక్ష అంశం అంటూ ప్రజలు శ్వేతజాతీయుల అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వారి నిరసనలకు మధ్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. #BlackLivesMatter #blackouttuesday హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ పలువురు ఇండియన్ పొలిటిషయన్స్ మరియు సినీ సెలబ్రిటీలు వారికి సంఘీభావాన్ని ప్రకటించారు. టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు అక్కినేని సమంత రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు కూడా దీని గురించి బ్లాక్ కలర్ పోస్టులు పెట్టారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇషాన్ ఖట్టర్.. విక్కీ కౌశల్.. కరణ్ జోహార్.. సారా అలీ ఖాన్ తదితరులు బ్లాక్ కలర్ పోస్ట్ లు పెట్టి వర్ణవివక్షపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ మాత్రం దీనిపై మరో విధంగా స్పందించింది.

బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురైన సోనమ్ మొదటి నుండి కూడా తన భావాలను నిర్భయంగా నిర్మొహమాటంగా షేర్ చేస్తూ వస్తుంది. సామాజిక అంశాలపైన.. మహిళ పట్ల జరుగుతున్న అన్యాయాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్స్ పెడుతూ సమస్యలు కొని తెచ్చుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్న జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం పట్ల నిరసనలు తెలుపుతుంటే సోనమ్ మరోసారి నెటిజన్స్ విమర్శలకు గురయ్యేలా కామెంట్ చేసింది. ఫస్ట్ నీ ఇల్లు నువ్వు శుభ్రం చేసుకో అని పోస్ట్ పెట్టింది. సోనమ్ కపూర్ ఉద్దేశ్యంలో ఫస్ట్ ఇండియాలో జరుగుతున్న దాడులపైన.. సమస్యలపైన స్పందించమని ఇండైరెక్ట్ గా పోస్ట్ చేసింది. సోనమ్ కపూర్ చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. సోనమ్ కపూర్ అవకాశవాది అని..హిపోక్రైట్ అని విమర్శలు చేస్తున్నారు. మరికొంత మాత్రం ఆమె చేసిన కామెంట్స్ ని సమర్ధిస్తూ వస్తున్నారు.
Please Read Disclaimer