అంధురాలిగా నయన్..ఆసక్తిని కలిగిస్తున్న ‘నెట్రికన్’ ఫస్ట్ లుక్..!

0

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ మూవీ ”నెట్రికన్”. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘గృహం’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్ రోల్ లో కనిపించబోతోంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా పోషించే నయనతార మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దపడింది. తాజాగా ‘నెట్రికన్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ ని సమంత అక్కినేని – గౌతమ్ వాసుదేవ్ మీనన్ – అనిరుద్ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు.

ఈ పోస్టర్ లో నయన్ తల నుంచి రక్తం కారుతుండగా.. చేతిలో రెంచీ వంటి ఆయుధాన్ని పట్టుకొని దాడి చేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. అందులోనూ ఇంతకముందు చిత్రాల కంటే వైవిధ్యమైన లుక్ లో నయనతార కనిపిస్తోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని కలిగించిన నయనతార ‘నెట్రికన్’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా నయనతార ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. అలానే ‘మూకుతి అమ్మన్’ ‘అన్నాత్తే’ వంటి సినిమాలు నయన్ చేతిలో ఉన్నాయి.