యంగ్ పెయిర్ ర్యాపో గిలిగింతలే

0

బాలీవుడ్ లో నటవారసుల వెల్లువ గురించి తెలిసిందే. 2018లో అరడజను పైగానే డెబ్యూలు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. అందులో షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్.. సాహో విలన్ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే కూడా ఉన్నారు. ధడక్ చిత్రంతో ఇషాన్ హీరోగా పరిచయం అవ్వగా అదే చిత్రంతో జాన్వీ కథానాయికగా పరిచయం అయ్యింది. అలాగే కరణ్ జోహార్ నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో అనన్య పాండే నాయికగా పరిచయం అయ్యింది.

ప్రస్తుతం ఇషాన్-అహనా జోడీ `ఖాళి-పీలి` అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. మక్భూల్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైగర్ జిందా హై దర్శకనిర్మాత అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రారంభమైంది. ఇదివరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. ఐకానిక్ ఖాళి-పీలి ట్యాక్సీ ముందు నిలబడి ఇషాన్ ఖత్తర్-అనన్య పాండే జంట స్టన్నింగ్ ఫోజుతో అదరగొట్టారు. ఇషాన్-అనన్య మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ముంబై భేండి బజార్ లో షూటింగ్ చేశారు. ఇక్కడ ఒక భారీ యాక్షన్ ఛేజ్ దృశ్యాన్ని చిత్రీకరించారు. ముంబైలోనే ఫేమస్ ఐకానిక్ బజార్ ఇది. నిరంతరం రద్ధీగా ఉంటుంది. దీంతో అధికారుల అనుమతులు తీసుకున్నారు. ఈ బజార్ లో షూటింగ్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ ఇదేనట. ఇదో చక్కని అనుభవాన్నిచ్చిందని దర్శకుడు తెలిపారు. డే షూట్ తో పాటుగా నాలుగు రాత్రులు ఈ బజార్ లో షూటింగ్ చేశారు. సినిమాలో కీలక సన్నివేశం ఇదని వెల్లడించారు. ఈ సినిమా ఆద్యంతం రెండే రెండు లుక్స్ లో కనిపిస్తున్నానని అహనా పాండే చెబుతోంది. ఇషాన్ కూడా ఇందులో 6ప్యాక్ యాబ్స్ తో సంథింగ్ హాట్ గా కనిపించబోతున్నాడు. జీస్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 12న సినిమా రిలీజ్ కానుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home