న్యూ పోస్టర్.. యాక్షన్ మోడ్ లో బన్నీ

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ చాలారోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లేకాదు.. రెండు లిరికల్ సాంగ్స్ కూడా విడుదల చేశారు. అందులో ఒకటి ప్లీజింగ్ మెలోడీ కాగా రెండోది ఫుల్ జోష్ ఉండే పార్టీ సాంగ్. రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్ముదులుపున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుండి తాజాగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ‘అల వైకుంఠపురములో’ టీమ్.

‘సామజవరగమన’ పాట మలయాళం వెర్షన్ నవంబర్ 10 తారీఖున విడుదల చేస్తామని ఈ పోస్టర్ లో వెల్లడించారు. బన్నీకి కేరళలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన ప్రతి సినిమా మలయాళంలో భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా జనవరి 12 న తెలుగు వెర్షన్ రిలీజ్ నాడే కేరళలో మలయాళం వెర్షన్ రిలీజ్ కానుంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే ఇంటెన్స్ లుక్ లో ఉన్న అల్లు అర్జున్ వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. చాక్లేట్ కలర్ షర్టు.. గ్రే కలర్ ప్యాంట్ ధరించి కాస్త రఫ్ లుక్ లోనే ఉన్నాడు. జేబులో ఏదో కవర్ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ‘అల వైకుంఠపురములో’ టీమ్ నుంచి వచ్చిన పోస్టర్లు అందంగానో.. లేక కలర్ ఫుల్ గా ఉన్నాయి కానీ ఈ పోస్టర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది.

ఈమధ్యే ‘అల వైకుంఠపురములో’ టీమ్ ‘సామజవరగమన ఆన్ ది వే’ అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టర్ లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో బన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండే వైట్ డ్రెస్ లో తనకు మాత్రమే సాధ్యమయ్యే గ్రేస్ తో ఒక క్రేజీ స్టెప్ వేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాటను అల్లు అర్జున్ – పూజా హెగ్డేలపై ప్యారిస్ లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారట. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ ట్యూన్.. సీతారామ శాస్త్రి గారి లిరిక్స్.. సిడ్ శ్రీరామ్ సింగింగ్ ఈ పాటను ‘మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియా’ గా నిలిపాయి. విజువల్స్.. డ్యాన్స్ దీనికి మించి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారట. ఈలెక్కన పాట ను థియేటర్ లో చూసిన వారు థ్రిల్ అవ్వడం పక్కానే!