రాజ్ తరుణ్ లొల్లి.. సందీప్ కిషన్ కాస్ట్యూమ్ డిజైనర్!

0

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట రాజ్ తరుణ్ పరిగెడుతున్న విజువల్స్ బైటకు వచ్చాయి. తర్వాత రాజ్ తరుణ్ తనవైపునుండి ఒక వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత కార్తీక్ అనే వ్యక్తి తన దగ్గరున్న వీడియో క్లిప్స్.. కాల్ రికార్డింగ్స్ బయట పెట్టాడు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఈ వీడియో క్లిప్స్.. కాల్ రికార్డింగ్స్ బయట పెట్టకుండా ఉండేందుకు రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర – కార్తిక్ ల మధ్య బేరసారాలు సాగాయి. అయితే ఈ విషయంపై కార్తీక్ వెర్షన్ “రాజ్ తరుణ్ .. రాజా రవీంద్ర నిజ స్వరూపం బయటపెట్టేందుకు” మాత్రమే అలా బేరసారాలు చేశానని.. అయితే తనకు వారి నుంచి బెదిరింపులు రావడంతో మీడియాకు.. పోలీసులకు వీడియోస్ అందజేశానని వెల్లడించాడు.

అయితే ఈ విషయంపై స్పందించిన రాజ్ తరుణ్ మేనేజర్ కమ్ యాక్టర్ రాజా రవీంద్ర కార్తీక్ క్రిమినల్ ఆలోచనలు ఉన్న వ్యక్తి అని ఆరోపించారు. కార్తిక్/కార్తిక్ శ్రీ హీరో సందీప్ కిషన్ కు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తాడని తెలిపాడు. కార్తిక్ పై గృహ హింస కేసు నమోదై ఉందని.. ఆయన వైఫ్ తో డైవోర్స్ కేసు కూడా ఉందని వెల్లడించాడు. అయితే కార్తీక్ మాత్రం తన భార్యతో పరస్పర అంగీకారంతో పోయినేడాది విడాకులు తీసుకున్నామని వెల్లడించాడు.

ఏదేమైనా రాజ్ తరుణ్ యాక్సిడెంట్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తం ఎపిసోడ్ లో ప్రాణ నష్టం లేదు.. ఎవరికీ గాయాలు కాలేదు. అయినా హాటెస్ట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఎవరైనా బడా స్టార్ హీరో లేదా బడా ప్రొడ్యూసర్ తనయుడు కనుక ఇదే ఘనకార్యం చేసి ఉంటే పరిస్థితి ఇలానే ఉండేదా?Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home