నిర్మాతలకు రేడియో మంటలు

0

పబ్లిసిటీలో టీవీ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తోందో అందరికి తెలిసిందే. అయితే గత కొన్నేళ్ళుగా ఎఫ్ ఎం రేడియో విప్లవం పుణ్యమా అని సినిమా ప్రచారానికి అది కూడా ఒక మంచి సాధనంగా మారుతోంది. సగటు నగర పౌరుడి జీవితంలో ఎఫ్ ఎం అనేది ఓ అంతర్భాగం కావడంతో మూవీ పబ్లిసిటీకి రేడియోను మంచి ఆప్షన్ గా పెట్టుకుంటారు నిర్మాతలు. అయితే టీవీ అయినా రేడియో అయినా డీలింగ్స్ నేరుగా నిర్మాతలు చేయరు.

ఉదాహరణకు టీవీ ఛానల్స్ కు సంబంధించి రేట్లను స్లాట్లను డిసైడ్ చేసి డీల్ చేసేందుకు అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ అఫ్ ఎల్ ఎల్పి ఉంటుంది. ఇప్పటిదాకా టీవీ తాలుకు డీలింగ్స్ కి మాత్రమే ఇది పరిమితమయ్యింది. నిర్మాతలు తమ సినిమాలను శాటిలైట్ ద్వారా ఎవరు ప్రమోట్ చేసుకోవాలన్నా వీళ్ళ ద్వారానే సులభంగా రీజనబుల్ రేట్లలో అవుతుంది. ఈ గ్రూప్ కూడా నిర్మాతలు ఏర్పరుచుకుందే.

అయితే ఇటీవలి కాలం సదరు ఎలెల్పి గ్రూప్ రేడియో హక్కులకు సంబంధించిన వ్యవహారాల్లో తల దూరుస్తూ తమ చెప్పిన రేట్లకు హక్కులు కొనే విధంగా ఎఫ్ ఎం యాజమాన్యాలకు కండిషన్లు పెట్టిందట. దీనికి ఎక్కడో కాలిన ఎఫ్ ఎం సంస్థలు కొత్త సినిమాల ప్రమోషన్లు ఇలా అయితే చేయమని తమ నిరసనను ప్రకటించారట. దీని వల్ల తమ ప్రచారానికి గండి పడుతోందని కొంత మంది ప్రేక్షకులకు తమ సినిమా విడుదలవుతోందన్న విషయం చేరకుండా పోతోందని నిర్మాతలు వాపోతున్నారు.

ఇది నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికీ ఎలెల్పి ధోరణి వల్ల మీడియం రేంజ్ ప్రొడ్యూసర్లు బాగా ఇబ్బంది పడుతున్నారట. ఇక కొత్త సినిమాల పాటలు ప్రోమోలు రేడియోలో రాకపోతే ఆడియో కంపెనీలకు సైతం దెబ్బే. వాళ్ళకు రేడియో కంపెనీలు చెల్లించే రాయల్టీ మొత్తం ఆగిపోతుంది. దీని వల్ల ఇది ఇలాగే కొనసాగితే హక్కులు ఎక్కువ ధరకు కొనడం సాధ్యం కాదని చెబుతున్నారట. మొత్తానికి ఎలెల్పి రేపిన మంట ఎఫ్ఎం రేడియో-నిర్మాతలు-ఆడియో కంపెనీలు ఇలా ముగ్గుర్ని ఇరకాటంలో పెట్టేశాయన్న మాట.
Please Read Disclaimer