#భీష్మ: గొడుగు పట్టక పోతే పడేయలేమా?

0

నితిన్ – రష్మిక జంట గా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం భీష్మ. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి
ఇప్పటికే నాయకానాయికల రొమాన్స్ కి సంబంధించిన పోస్టర్లు రిలీజై ఆకట్టుకున్నాయి. ఇటీవలే సింగిల్స్ ఆంథెమ్ రిలీజై శ్రోతల్లోకి దూసుకెళ్లింది. సింగిల్ బోయ్ తుంటరి వేషాలకు సంబంధించిన కథ తో ఈ సినిమా ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు.

ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రచార చిత్రంలో “ నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం“ అనే డైలాగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే భీష్మ టీమ్ పాత సంవత్సరానికి టాటా చెబుతూ న్యూ ఇయర్ కి వెల్ కం చెబుతూ.. డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్స్ ని ఓ రేంజులో జరుపుకుంది. పనిలో పనిగా ఓ కొత్త పోస్టర్ ని జనవరి 1 కానుకగా రిలీజ్ చేశారు.

ఈసారి కూడా భీష్మ పాట్లు ఇందులో కనిపిస్తున్నాయి. అమ్మాయిని పడేయాలంటే గొడుగు పట్టాల్సిందేనని అబ్బాయిలకు ఇలాంటి పాట్లు తప్పవని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. రష్మిక బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపిస్తున్నా ఎల్లో కోట్ ధరించి ఎక్స్ క్లూజివ్ గా కనిపిస్తోంది. ఆ కళ్లకు బ్లాక్ గ్లాసెస్ కిర్రాక్ పుట్టిస్తున్నాయ్. ఇక తన వెంట పడుతున్న సింగిల్ బోయ్ నితిన్ డిజైనర్ లుక్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. నితిన్ నెవ్వర్ బిఫోర్ స్టైలింగ్ ఫ్యాన్స్ కి ఆ లెవల్లో కనెక్టవ్వడం ఖాయం. టాప్ టు బాటమ్ బ్లాక్ లో కనిపిస్తున్న నితిన్ కి ఆ పైన ధరించిన పట్టీల షర్ట్ ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. ఒక చేతి లో ఎర్ర రంగు గొడుగు కనిపిస్తోంది. రష్మిక వెంట పడుతూ.. తనకు గడుగు పడుతూ చాలానే తంటాలు పడుతున్నాడు. అయితే ఇంత చేసినా కుర్రాడికి పడలేదా ఏమిటో!! ఇవి బోయ్స్ అందరికీ ఉండే పాట్లే కదా!
Please Read Disclaimer