పోస్టర్ టాక్: యంగ్ స్మార్ట్ డిజైనర్ రాజా

0

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి. ఐ. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజ కెరీర్ లోనే యూనిక్ కాన్సెప్టుతో ప్రయోగాత్మకం గా తెరకెక్కుతున్న చిత్రమిది. మాస్ రాజా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. 1990 నాటి పాత్రకు.. నేటి జనరేషన్ పాత్రకు కనెక్షన్ ఏమిటి? అన్నది తెరపై సర్ ప్రైజ్ చేస్తుందట. ఇంతకు ముందు చిత్రబృందం విడుదల చేసిన రెట్రో లుక్ టైటిల్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మాస్ రాజాని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయనున్నారని ఫ్యాన్స్ కి అర్థమైంది.

తాజాగా మరో కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. `హ్యాపీ న్యూ ఇయర్ 2020` అంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ కి శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్టర్ ని విడుదల చేశారు. రాజా ఈ పోస్టర్ లో మునుపటి కంటే ఎంతో యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అదే పక్క పాపిడి.. తీక్షణమైన చూపులు.. పైగా మజిల్ పవర్ చూపిస్తున్నాడు. ఇక ఆ షర్ట్ డిజైన్ చూడగానే ఇది రెట్రో లుక్ అని అర్థమవుతోంది. దానిపై ప్రింటెడ్ కంకణాల స్టైల్.. వెడల్పాటి కాలర్ డిజైన్ చూస్తుంటే 90ల నాటి కాలాన్ని ప్రెజెంట్ చేసే ప్రయత్నమేనని భావించాల్సి వస్తోంది. పైగా నోట్లో రెట్రో డేస్ స్పెషల్ సిగార్ కనిపిస్తోంది. పొగను రింగు రింగులుగా వదులుతూ నాటి వాతావరణంలోకి తీసుకెళ్లారు.

డిస్కో రాజా అన్న టైటిల్ కి తగ్గట్టే రవితేజ డిస్కో ఆడిస్తాడా? అంటే.. జనవరి 24వరకూ వేచి చూడాల్సిందే. పాయల్ రాజ్ పుత్-నభా నటేష్- తాన్యా హోప్ ఈ చిత్రంలో కథానాయికలు. వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా..అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Please Read Disclaimer