న్యూస్ చానెల్స్ కు షాకిచ్చిన బిగ్ బాస్!

0

తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన నంబర్ 1 రియాలిటీ షో మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. శనివారం ఆరుగురు ఎలిమినేటర్స్ నుంచి ఇద్దరినీ సేఫ్ జోన్ లోకి పంపించిన హోస్ట్ నాగార్జున ఆదివారం హౌస్ లోంచి తొలి వారం బయటకు వెళ్లే వ్యక్తిని అనౌన్స్ చేయనున్నారు.

అయితే ఎలిమినేట్ అయ్యే వ్యక్తితో పోయిన సారి వివిధ న్యూస్ చానెల్స్ డిబేట్లకు పిలిచి రచ్చరచ్చ చేసేవి.  అటుతిప్పి ఇటు తిప్పి వివాదాలను రాజేసి బిగ్ బాస్ కాంట్రావర్సీలను క్యాష్ చేసుకునేవి. బయటకు వెళ్లాక కంటెస్టెంట్లు కూడా అన్ని చానెల్స్ తిరుగుతూ బిగ్ బాస్ లోని వివాదాలను విడమరిచి చెప్పేవారు. దీనివల్ల సదురు చానెళ్లకు రేటింగ్ వచ్చేవి. బిగ్ బాస్ పై వివాదాలు చుట్టుముట్టేవి.

అందుకే ఈసారి బిగ్ బాస్ టీం కొత్త ఎత్తు వేసింది. ఇక నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మొదట స్టార్ మాకే ఇంటర్వ్యూ ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఆ వివాదాలు – రేటింగ్ లు న్యూస్ చానెల్స్ కు దక్కకుండా స్టార్ మాకే దక్కేలా వారితో ఇంటర్వ్యూలకు ప్లాన్ చేసింది. ఎలిమినేట్ కాగానే స్టార్ మాతో వారు ఈ షోకు సంబంధించిన అన్ని విషయాలు పంచుకోవాలన్న షరతు పెట్టిందన్న మాట..

ఇందుకోసం పోయినసారి బిగ్ బాస్ సీజన్2లో ఫైనల్స్ కు చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న హీరో తనీష్ ను హోస్ట్ గా పెట్టుకుంది స్టార్ మా. తాజాగా తనీష్ తో దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. బిగ్ బాస్ ఎలిమినేటర్స్ తో తనీష్ డిబేట్లు పెట్టి క్యాష్ చేసుకొనే సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో న్యూస్ చానెల్స్ కు ఆ క్రెడిట్ దక్కకుండా స్టార్ మా చానెల్ కే దక్కేలా బిగ్ బాస్ భలే ప్లాన్ చేశారని చెప్పవచ్చు.
Please Read Disclaimer