వెంకటేష్ కి గాయం..చాలా రోజులైందట!

0

ఈరోజు హీరో వెంకటేష్ కి గాయమైనట్టు ఓ పత్రికలో ప్రచురించారు. ఆ వార్త చూసి మిగతా వెబ్సైట్స్ కూడా ఆ వార్తను కవర్ చేసాయి. దీంతో వెంకీ ఫ్యాన్స్ ఉన్నపళంగా కంగారు పడుతున్నారు. అసలు వెంకీ కి ఏమైందని షాక్ అవుతున్నారు. కొందరు ఫ్యాన్స్ ఇప్పటికే వెంకీ టీమ్ కి ఫోన్ చేసి తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి సమాచారం అడిగి తెలుసుకున్నారు.

అసలు విషయం ఏమిటంటే వెంకటేష్ కి ఓ చిన్న గాయమైన సంగతి నిజమే కానీ అది ఇప్పుడు కాదు ఓ పదిహేను రోజుల క్రిందట జరిగిందట. రామోజీ ఫిలిం సిటీలో ‘వెంకీ మామ’ సినిమాలో పాటను షూట్ లో డాన్స్ మూమెంట్ ఇస్తుండగా వెంకీ కాలు చిన్నగా బెణికింది. అయితే వెంటనే షూటింగ్ కి బ్రేక్ట్ ఇచ్చి వెంకటేష్ ఫిజియోథెరపీ స్పెషలిస్ట్ ను కలిసారట. అయితే ఎక్స్ రే తీసి పెద్దగా ఏమి లేదని జస్ట్ కాలు బెణికిందని చెప్పారట డాక్టర్. అయితే ఆ మరుసటి రోజే వెంకీ కి కాలు నయం అయిందని వెంటనే షూట్ మొదలు పెట్టారట. అంతే కాదు నిన్నటి వరకూ వెంకీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇవాళ ఆదివారం కారణంగా షూటింగ్ లేదు. మళ్లీ రేపటి నుండి యధావిధిగా ఉంటుంది.

అదీ సంగతి… ఇవన్నీ తెలుసుకోకుండా మీడియా వార్తలు ప్రచురించడంపై వెంకీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ ను క్లైమాక్స్ కి తీసుకొచ్చిన వెంకీ తదుపరి సినిమాను త్రినాద్ రావు నక్కిన తో చేయనున్నాడు. ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు వెంకీ.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.
Please Read Disclaimer