స్టార్ హీరోయిన్ ను ఆకాశానికి ఎత్తేసిన భర్త!

0

బాలీవుడ్ స్టార్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయింది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తమ కంటే వయస్సులో చిన్న వాళ్లను పెళ్లాడారు. వాళ్ళ అందరి కంటే భిన్నంగా ప్రియాంక తన కంటే వయస్సులో పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ పాపులర్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే ఈ జంట ప్రపంచవ్యాప్తంగా పలు పర్యాటక ప్రాంతాల్లో చక్కర్లు కొడుతూ ఎంచక్కా ఎంజాయ్ చేశారో మనం అందరం చూశాం. పెళ్లయ్యాక కూడా ప్రియాంక భర్తతో హాలిడే ట్రిప్ లు బాగా ఎంజాయ్ చేస్తోంది. తన సోషల్ మీడియాలో చిట్టి పొట్టి దుస్తులతో… భర్త బిగి కౌగిలిలో బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ నెటిజన్లకు మంచి వీనుల విందు ఇస్తోంది.

ఇప్పటివరకు ప్రియాంక తన భర్తని పొగుడుతూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు దీనికి రివర్స్ గా ప్రియాంక పై నిక్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఆమెను ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. ప్రియాంక గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రియాంక నిక్ కోసం చేసిన ఉపవాసాన్ని చూసి తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నార్త్ ఇండియాలో కార్వా చౌత్ అనే పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి ముందు వచ్చే చవితి రోజు ఈ పండుగ జరుగుతుంది.

ఈ పండగలో భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రోజంతా ఉపవాసం ఉండి – చంద్రుడిని చూశాక భోజనం చేస్తుంటారు భార్యలు. ఇప్పుడు ప్రియాంక కూడా తన భర్త కోసం ఇలా ఉపవాసం చేసిందట. దీంతో నిక్ ఆనందానికి అవధులు లేవు. తన భార్య ఇండియన్ హిందువు అని… అన్నింట్లోనూ ఆమె అసమానురాలన్న నిక్… ఆమె భారత సంస్కృతి – సంప్రదాయాల గురించి తనకు ఎంతో నేర్పిందని… ఆమెను తాను ఎంతో ప్రేమిస్తున్నానని… తామిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని…. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు అని పేర్కొన్నాడు.
Please Read Disclaimer