అత్తమామలు ఇలా దిగిపోయారే!!

0మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు..
మావా.. మనసే లాగేసిండు..
లగ్గమెప్పుడురా మామా అంటే..
మాఘమాసం వెళ్లే దాకా మంచి రోజు లేదన్నాడే..
ఆగేదెట్టాగ.. ! అందాక ఏగేదెట్టాగ!? ఆగేదెట్టాగ.. ! అందాక ఏగేదెట్టాగ!?
మడోన్న చెప్పవే.. డయానా చెప్పవే.. జెన్నిఫర్ చెప్పవే.. వేగెదెట్టాగ!?
మాఘమాసమొచ్చేదాకా ఆగేదెట్టాగ!! మంచిరోజు లేదన్నాడే!!
వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాడా.. సైట్ కొట్టినాడే!!

`దేవదాస్` సాంగ్ ఇది. ఈ పాటలో మాదిరిగానే ఉందీ యవ్వారం! పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా విదేశీ ప్రియుడు ఆగలేనంటున్నాడు! ఏదో ఒకటి చేసేట్టే ఉన్నాడు!! అతడిలో స్పీడ్ చూస్తుంటే అగ్గి రాజుకుపోతోంది. ఏ క్షణం ఏం చేస్తాడోనని అభిమానుల్లో ఒకటే కంగారు. ఇదివరకూ లండన్ నుంచి నేరుగా ప్రేయసితో కలిసి ముంబైలో దిగిపోయిన నిక్ జోనాస్.. అప్పట్లో ప్రియాంక చోప్రా కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు. కానీ ఈసారి సీన్ చూస్తుంటే పెళ్లికి ఇంకెంతో సమయం లేదనే అర్థమవుతోంది. నిక్ జోనాస్ మామ్-డాడ్ ని వెంటపెట్టుకుని ఈరోజు ముంబైలో దిగిపోయి పెద్ద షాకిచ్చాడు.. దీపిక పెళ్లి నవంబర్ 20 – మరి పీసీ పెళ్లి ఎప్పుడు? అంటూ అభిమానులు చెవులు కొరికేసుకుంటున్నారు. ఇంతకీ మాఘమాసం వెళ్లే దాకా ఆగలేడంటారా? ఇంతకీ పీసీ అత్తమామలు చేతుల నిండా బ్యాగులతో దిగారు. షాపింగు ఫుల్లుగానే చేసినట్టున్నారు కాబోయే కోడలు కోసం!ప్చ్!! ఏం తెచ్చారబ్బా?