అంబానీ ఇంట ఆయనతో పీసీ హోలీ సంబరం చూశారా?

0

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికా కోడలు అయినప్పటినుంచి పూర్తిగా బాలీవుడ్ కి.. ముంబైకి దూరమైపోయిన సంగతి తెలిసిందే. భర్త నిక్ తో కలిసి అమెరికాలో కాపురం పెట్టేసిన ఈ బ్యూటీ అప్పుడప్పుడు ముంబై విజిట్ కి వస్తోంది. దీంతో బాలీవుడ్ లో కొత్త కమిట్ మెంట్లకు దూరమైపోవాల్సి వచ్చింది. ఏదైతేనేం నిక్ తో తన సంసార జీవనాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగించేందుకే పీసీ ఈ కఠోర నిర్ణయం తీసుకుందని భావించాల్సి ఉంటుంది.

ఇక అమెరికాలో తన ఫ్యామిలీ లైఫ్ .. జాలీ లైఫ్.. సెలబ్రిటీ హోదాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ ని పీసీ రెగ్యులర్ గానే అందిస్తోంది. ఇక హోలీ సందర్భంగా ప్రస్తుతం నిక్యాంకా జోడీ ముంబై విహారంలో ఉంది. ఇక్కడ ది గ్రేట్ అంబానీల పార్టీకి ఈ జోడీ అటెండయ్యింది. ఈ హోలీ పార్టీ నుంచి నిక్ జోనాస్ స్వయంగా ఇన్ స్టాలో కొన్ని ఫోటోల్ని షేర్ చేశారు. ఈ ఫోటోల్లో పీసీ ఫుల్ చిలౌట్ మూవ్ మెంట్ తో కనిపిస్తోంది. భర్తతో కలిసి ఈవెంట్ ని ఓ రేంజులోనే ఎంజాయ్ చేస్తోంది పీసీ. ఇక ఈ వేడుకకు నిక్యాంక జంట వైట్ అండ్ వైట్ లో సాంప్రదాయ బద్ధంగా విచ్చేయడం ఆసక్తిని రేకెత్తించింది.

అంబానీ డాటర్ ఇషా అంబానీ .. ఆమె భర్త ఆనంద్ పిరమల్ శుక్రవారం సాయంత్రం ముంబై లో గ్రాండ్ హోలీ పార్టీని నిర్వహించడం.. ఈ వేడుకకు తన స్నేహితురాలు అయిన పీసీని ఇషా ఆహ్వానించడంతో ఈ జంట అక్కడ వాలిపోయిందట. ప్రియాంక – నిక్ జోనాస్ జంట స్పెషలిస్ట్ డిజైనర్స్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్స్ ధరించి ఈ వేదికపై సందడి చేశారు. నిక్యాంక జంటతో ఇదే వేదికపై కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ జంట సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. “నా మొదటి హోలీ“ అంటూ నిక్ ఈ సందర్భంగా సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇక ఈ వేడుకలో ప్రియాంక తో కత్రిన స్నేహానికి సంబంధించిన లుక్ అభిమానుల్లో వైరల్ గా మారింది. ఈ గ్రాండ్ పార్టీకి సంబంధించిన నిక్యాంక ఫోటోలు వీడియోలతో పాటు.. కత్రిన- విక్కీ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు అంతే వైరల్ గా మారాయి. ఇషా అంబానీ హోలీ పార్టీ స్టార్-స్టడెడ్ గెస్ట్ ల జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్- సోనాలి బెండ్రే- హుమా ఖురేషి- డయానా పెంటీ- రాజ్ కుమార్ రావు-పత్ర లేఖ తదితరులు ఉన్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-