ఇది ఇస్మార్ట్ గ్లామర్ వడ్డన

0

ఈమధ్య టాలీవుడ్ లో తెరపైకి వచ్చిన భామ నిధి అగర్వాల్. మొదట నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఒక్కసారిగా నిధికి డిమాండ్ పెరిగింది. మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. కెరీర్ సెట్ అయింది కదా అని కూల్ గా కూర్చోకుండా సోషల్ మీడియా తోలు వొలిచే కార్యక్రమం చేపట్టింది. హాటు ఫోటోలతో నెటిజన్లపై గ్లామర్ స్ట్రైక్స్ చేస్తోంది.

నిధి ఈమధ్య ఒక హాట్ ఫోటోషూట్ చేసింది. రెడ్ కలర్ టాప్.. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న లెహెంగా ధరించి ఒక స్టైలిష్ పోజిచ్చింది. అందాల విందుకు ఇక మిల్లీ మీటర్ కూడా అడ్డం రాకుండా ఒక నీలం రంగు చున్ని కూడా కప్పుకుంది. కమర్షియల్ ఫార్మాట్ సినిమాల్లో హీరోయిన్లా ఆ చున్ని కూడా ఈ ఫోటోలో ఉంది అంటే ఉంది అంతే. సరే ఈ ఫోటోలో నిధి తన అందాల నిధులను పూర్తిగా ధారపోసింది. మెడలో ఒక నెక్లెస్.. చెవికి మ్యాచింగ్ కమ్మలు ధరించి స్టైల్ ను రంగరించింది. అయినా ఇలాంటి పోజులిస్తే నెటిజన్ల పరిస్థితి ఏం కావాలి?

నిధి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమాతో పాటుగా తమిళంలో ‘భూమి’ అనే చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer