మెగా కాంపౌండ్ లో ఇస్మార్ట్ భామలు

0

ఓవర్ నైట్ లో ఇస్మార్ట్ టీమ్ ఫేట్ మారి పోయింది. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ టాక్ తో ఆ టీమ్ మెంబర్స్ అందరికీ వరుస అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఇక అందాల కథానాయికలు నభా నటేష్-నిధి అగర్వాల్ కెరీర్ కి ఎదురే లేకుండా పోయింది. అప్పటి వరకూ స్లోఫేస్ లో ఉన్న కెరీర్ ఒక్కసారిగా జెట్ స్పీడ్ అందుకుంది. ఇదంతా గురుడు పూరి జగన్నాథ్ చలువ. ఆయన మార్క్ మాసిజం ఆ ఇద్దరు భామలకు అంత పెద్ద లైఫిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి- నభా ఇద్దరూ గ్లామర్ డాల్స్ గా తెరపై ఒదిగి పోయిన వైనం కుర్రాళ్లు అంత తేలిగ్గా మర్చిపోలేరు.

సరిగ్గా ఇదే పాయింట్ పలువురు మేకర్స్ ని ఆకర్షించింది. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు భామలకు అవకాశాలిచ్చేందుకు పోటా పోటీగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం నిధి అగర్వాల్ అశోక్ గల్లా చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు కోలీవుడ్ లో భూమి అనే భారీ సినిమాలో నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు క్యూ లో ఉన్నాయి. ఇక నభా నటేష్ రవితేజ సరసన `డిస్కో రాజా` అనే చిత్రంలో నటిస్తోంది. కొన్ని కథలు విని హోల్డ్ లో పెట్టిందట.

ఈ నేపథ్యం లో తాజాగా ఈ ఇద్దరు భామలకు మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి పిలుపు వచ్చిందిట. వరుణ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు అవసరమట. ఆ ఇద్దరుఇస్మార్ట్ భామలు అయితే పర్ పెక్ట్ గా సరిపోతారని వరుణ్-కొర్రపాటి బృందం భావిస్తున్నారట. ఇప్పటికే సదరు భామలకు కాల్ వచ్చిందని తెలుస్తోంది. అంతేకాదు .. వెంటనే కాల్షీట్ల ను కూడా లాక్ చేసారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ముందుగా ఒక భామగా కియారా అద్వానీ ని తీసుకోవాలనుకున్నారు. కానీ తన డేట్లు సర్దుబాటు కాకపోవడంతే స్కిప్ కొట్టిందని తెలుస్తోంది. కియరా ఒకేసారి నాలుగైదు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తన స్థానంలో అంతకుమించి హాట్ గాళ్స్ ని ఎంపిక చేసుకోవడం హీటెక్కిస్తోంది.
Please Read Disclaimer