ఇస్మార్ట్ అందాలే ఇస్పెషల్!

0

విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గద్దల కొండ గణేష్’ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ ఒక బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారు.

అయితే ఈ సినిమాలో నిధి పాత్రకు పెద్దగా స్కోప్ లేదని సమాచారం. ఈ సినిమా కథ ప్రధానంగా గురు శిష్యుల మధ్య జరుగుతుందని.. బాక్సర్ గా వరుణ్.. ఆయన బాక్సింగ్ కోచ్ కు మధ్య కథ నడుస్తుందట. నిధి పాత్ర పక్కా కమర్షియల్ హీరోయిన్ తరహాలో కలర్ఫుల్ గా ఉంటుందట. పాటలలో ఇస్మార్ట్ అందాల విందు కూడా ఉంటుందట. ఈ సినిమాకు నిధి అందాలు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ లో నిధి గ్లామర్ షో ఒక హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ సినిమాలో నిధి తన గ్లామర్ అస్త్రాన్ని ప్రేక్షకులపై ప్రయోగించబోతోంది.

థమన్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నాడు. ఈ సినిమాను అల్లు బాబీ.. సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తొలిసారిగా ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న వరుణ్ కు విజయం లభిస్తుందా.. నిధి గ్లామర్ షో అందుకు సహాయపడుతుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer