కామ్.. కూల్.. కానీ క్లీవేజ్ షోల రచ్చ రంబోలా!

0

నిధి అగర్వాల్.. ఇప్పటివరకూ తెలుగులో మూడు సినిమాలు చేసింది. నాగ చైతన్యతో ‘సవ్యసాచి’.. అఖిల్ తో ‘Mr. మజ్ను’.. తాజాగా రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’. మొదటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. హిట్ కొట్టకపోతే ఐరన్ లెగ్ ముద్ర పడే అవకాశాలు పుష్కలంగా ఉండే సమయంలో ‘ఇస్మార్ట్ శంకర్’ నిధికి మొదటి విజయాన్ని అందించింది. మొదటి రెండు సినిమాలలో కూడా నిధి గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి కానీ మూడవ సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ కావడంతో కాస్త ఎక్కువగా గ్లామర్ ను ఒలికించింది.

సినిమాలోనే కాదు.. ప్రమోషన్స్ లో కూడా వీలైనంత గ్లామరస్ గా.. హాట్ గా కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది. దాదాపుగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిర్వహించిన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లోనూ పాల్గొని ఆ ఈవెంట్లను స్పైసీగా మార్చింది. లుక్స్ వైజ్ నిధి ఇన్నోసెంట్ గా.. కామ్ గా.. కూల్ గా కనిపిస్తుంది. కానీ నిధి క్లీవేజ్ షో చేయని ఇస్మార్ట్ ఈవెంట్ ఒక్కటి కూడా లేదంటేనే మనం పాప గ్లామర్ ట్రెండ్ ను ఎంత చక్కగా ఒడిసిపట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ‘ఇస్మార్ట్ శంకర్’ లో నిధి కంటే నభా నటేష్ కే నటనకు స్కోప్ ఎక్కువ ఉందని.. నభా పూర్తిగా నిధిని డామినేట్ చేసిందని కొందరు కామెంట్ చేశారు కానీ అదేమీ నిజం కాదు. నిధి తన గ్లామర్ షో తో వీలైనంత ఫోకస్ తనపై ఉండేలా చూసుకుంది. సినిమాలో తన పాత్ర స్వభావాన్ని బట్టి అలా క్లాస్ గా కనిపించినా పాటల్లో రెచ్చిపోయి మరీ క్లీవేజ్ సోకులు వడ్డిస్తూ అందాల ప్రదర్శన చేసింది.

అందరూ నిధి అంటే గ్లామర్ డాల్ అనుకుంటున్నారు కానీ నిధి ఒక సూపర్బ్ డ్యాన్సర్. కథక్.. బెల్లీ డ్యాన్స్.. బాలే డాన్స్ లో ట్రైనింగ్ తీసుకుంది. ఈ డాన్సులన్నిటినీ ఇరగదీస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే నిధి ప్రస్తుతం ‘ఇక్కా’.. ‘మాస్క్’ అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో నటించడం ఇదేమీ మొదటిసారి కాదు.. నిధి డెబ్యూ బాలీవుడ్ ఫిలిం ‘మున్నా మైఖేల్’ తోనే జరిగింది. ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది కాబట్టి తెలుగులో కూడా మంచి ఆఫర్లే వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
Please Read Disclaimer