బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇస్మార్ట్ ట్రీట్ నిజమేనా?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మరో నాలుగు రోజుల్లో పూర్తి కాబోతుంది. ప్రతి సీజన్ ఫైనల్ ఎపిసోడ్స్ ను చాలా విభిన్నంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి ఫైనల్ విన్నర్ ను ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ విషయమై క్లారిటీ రాకుండానే మరో విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు బుల్లి తెర వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది. అదేంటి అంటే హీరోయిన్ నిధి అగర్వాల్ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయబోతుందట.

బిగ్ బాస్ స్టేజ్ పై ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సందడి ఎందుకా అని ఆలోచిస్తున్నారా. నిధి అగర్వాల్ అండ్ టీం ఫైనల్ ఎపిసోడ్ ప్రారంభంలో అయిదు నుండి పది నిమిషాల పాటు డాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్టార్ మా వర్గాలు అధికారికంగా దృవీకరించకున్నా కొందరు ఈ విషయాన్ని లీక్ చేస్తున్నారు. ఫైనల్ ఎపిసోడ్ ను గ్రాండ్ గా ముగించడంతో పాటు ప్రేక్షకులకు కన్నుల విందు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ సీజన్ 3లో ఫైనల్ కంటెస్టెంట్స్ గా శ్రీముఖి.. బాబా భాస్కర్.. వరుణ్.. రాహుల్.. అలీలు మిగిలారు. వీరు అయిదుగురు కూడా ఫైనల్ విన్నర్ గా నిలిచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వారి భవితవ్యం ప్రేక్షకుల చేతిలో ఉంది. షో లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఎవరు ఎక్కువగా ఓట్లు వేసి విన్నర్ ను చేస్తారా అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. దాంతో పాటు ఆ విన్నర్ ను ప్రకటించబోతున్న స్టార్ ఎవరై ఉంటారా అని కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer