ఇస్మార్ట్ భామ ఒన్స్ మోర్

0

ఈమధ్య టాలీవుడ్ లో కొత్త తరం భామల హవా పెరుగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి అగర్వాల్ కూడా ఈ లిస్టులో చేరి కెరీర్ లో పైపైకి దూసుకుపోతోంది. టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసిన ఈ భామకు మొదట్లో సక్సెస్ దక్కలేదు కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విజయంతో నిధి ఒక్కసారిగా హాట్ షాట్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ భామకు నటన విషయంలో పెద్దగా మార్కులు పడలేదు కానీ గ్లామర్ విషయంలో నూటికి నూట యాభై మార్కులు తెచ్చుకుంది. ఎలాగూ గ్లామర్ విషయంలో దిట్ట కాబట్టి సూపర్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఉంది. తాజాగా ఈ భామ ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక సూపర్ హాట్ ఫోటో షూట్ చేసింది. లైట్ గ్రే కలర్ ఛోళి లెహెంగాలో ఒక ఖజురహో పోజిచ్చింది. మ్యాచింగ్ చెవి కమ్మలు.. మ్యాచింగ్ గాజులు ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఫోటోకు నేపథ్యంలో ఉన్న చాక్లెట్ కలర్ తో నిధి అందం మరింతగా పెరిగింది.

సినిమాల విషయానికి వస్తే నిధి ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా తమిళంలో ‘భూమి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా నిధికి కొలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయట.




Please Read Disclaimer